అనారోగ్యంతో కన్నుమూసిన సోమ్‌నాథ్‌ ఛటర్జీకి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వీరితో పాటు సోమనాథ్‌ ఛటర్జీ మృతికి పలువురు కేంద్రమంత్రులు, రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. అందరూ సోమ్‌నాథ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 



 


కేసీఆర్ ప్రత్యేకంగా సోమ్‌నాథ్‌ ఛటర్జీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాము ఎంపిలుగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసినప్పుడు స్పీకర్‌గా సోమ్‌నాథ్‌ ఛటర్జీ ఉన్నారని.. సభలో తమ వాదనను వినిపించే సమయంలో ఆయనెంతో సహృదయంతో వ్యవహరించారని అన్నారు.


బెంగాల్, భారత ప్రజలకు ఆయన లేని లోటు తీర్చలేనిదని..పదిసార్లు ఎంపీగా సేవలందించిన ఆయన.. పార్లమెంట్ సభ్యుల్లో పార్టీలకతీతంగా అందరి మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేస్తుకున్నారు. పార్లమెంటేరియన్‌గా, లోక్‌సభ స్పీకర్‌గా సోమ్‌నాథ్‌ చేసిన కృషిని వారు గుర్తు చేసుకున్నారు.


లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈ నెల 7వ తేదీన కోల్‌కతాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ఆయన పరిస్థితి విషమంగా మారింది. చికిత్స పొందుతూ ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.