ఈ నెల 7వ తేదీన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. "సబ్‌మెరైన్ ఆర్మ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ" ఉత్సవాల్లో పాలు పంచుకోవడానికి వస్తున్న రాష్ట్రపతి రెండు రోజులు నగరంలో ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో "ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే" గుర్తుగా ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించనున్నారు.


ప్రస్తుతం ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో టియు 142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం తుది మెరుగులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఒకవేళ రాష్ట్రపతి సందర్శన సమయంలో ఆ పనులు కూడా పూర్తిస్థాయిలో పూర్తయితే, మ్యూజియంను ఆయన చేతుల మీద ప్రారంభించే అవకాశం ఉందని ఈఎన్‌సీ వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ తెలిపారు.