PM Modi Tour: ఏపీలో ప్రధాని మోదీ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈనెల 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి దేశ ప్రధాని రానున్నారు. ఆయన హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి 4న ఉదయం 9.29 గంటలకు బయలుదేరి..ఉదయం 10.10 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.15 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 10.50 గంటలకు భీమవరానికి వెళ్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10.55 గంటలకు హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక వాహనంలో సభా ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జాతినుద్దేశించి మాట్లాడతారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం 12.30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 1.05 గంటలకు విజయవాడకు వస్తారు. ప్రధాని టూర్‌ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆంక్షలను సైతం కఠినతరం చేశారు. రేపు(ఆదివారం) కాళ్ల మండలం నుంచి భీమవరం వైపునకు వాహనాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.


ఆ ప్రాంతంలో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా 4న షాపులను మూసివేయాలని ఆదేశించారు. మరోవైపు భీమవరంలో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను కల్పించారు. ఇప్పటికే భీమవరం ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే వారిపై ఆరా తీస్తున్నారు.


Also read: Telangana Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి పచ్చజెండా..!


Also read: Revanth Reddy: పోరు గడ్డపై అడుగు పెట్టే అర్హత మోదీకి లేదు..టీపీసీసీ రేవంత్‌రెడ్డి ధ్వజం..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook