Secunderabad-Visakhapatnam Vande Bharat Express: సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ నేటి నుండి పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానున్న ఈ రైలును ప్రధాని నరేంద్రమోదీ దిల్లీ నుంచి 10.30కి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.  సికింద్రాబాద్‌ స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు. సికింద్రాబాద్‌ 10వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి ఈ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే ఈ రైలు  సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంది. ఇప్పటికే కేంద్రమంత్రులు స్టేషన్ చేరుకుని శనివారం రాత్రి ఏర్పాట్లును పర్యవేక్షించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దిల్లీ-కట్రా మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇప్పటి వరకు అత్యధిక దూరం (655 కి.మీ.) నడిచే ట్రైన్ గా ఉంది. తాజాగా సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ దేశంలో అత్యధిక దూరం (698.5కి.మీ.) నడిచే రైలుగా రికార్డు సృష్టించనుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏడు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులోకి రాగా.. ఇప్పుడు ప్రారంభించబోయేది ఎనిమిదో రైలు. 


సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సోమవారం నుంచి అందుబాటులోకి రానుండగా.. సీట్ల రిజర్వేషన్ శనివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. రాబోయే నాలుగు రోజులపాటు సీట్లన్నీ పుల్ అయిపోయాయి. ప్రస్తుతం బుక్ చేసుకోవాలంటే వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. అయితే టికెట్ల ధరలు చాలా ఎక్కువగా ఉండటం సామాన్యులకు కొద్దిగా ఇబ్బంది కలించే విషయం. 


Also Read: Vandebharat Express: విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అధికారిక టైమింగ్స్, టికెట్ ధరలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook