konaseema protest: పచ్చటి చెట్ల మధ్య ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లా..ఇప్పుడు భగ్గుమంటోంది. జిల్లా పేరు మార్చవద్దని కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.  దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఐనా ఆందోళనకారులు శాంతించడం లేదు. ఇవాళ ఛలో రావులపాలెంకు జిల్లా సాధన సమితి పిలుపు ఇచ్చింది. నిన్నటి పరిణామాలతో దృష్టిలో ఉంచుకుని పోలీసులు రెండింత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ప్రశాంతంగా ఉన్న రావులపాలెంలో ఆందోళనలు మొదలయ్యాయి. పట్టణంలోని కళా వెంకట్రావు బొమ్మ వద్ద ఆందోళనకారులు నిరసనకు దిగారు. జిల్లా పేరు మార్చొద్దని నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న అమలాపురంలో జరిగిన నిరసనలు అల్లర్లకు దారి తీశాయి. జిల్లా పేరు మార్చవద్దంటూ జిల్లా సాధన సమితి ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈక్రమంలో శాంతియుతంగా జరుగుతున్న నిరసన ఒక్కసారిగా భగ్గుమంది. మంత్రి విశ్వరూప్‌ ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. అప్రమత్తమైన పోలీసులు మంత్రి విశ్వరూప్‌, కుటుంబసభ్యులను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో మంత్రి ఇల్లు పూర్తి కాలిపోయింది. ఇంట్లోని ఫర్నీచర్, వస్తువులన్నీ కాలి బూడిదైయ్యాయి. ఇటు ఎమ్మెల్యే సతీష్‌ ఇంటిపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు.  


ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం..కోనసీమ జిల్లాకు భారీగా పోలీసులను తరలించింది. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అనువనువు పోలీసులు జల్లెడ పడుతున్నారు. పరిస్థితి చేయి దాటిపోకుండా హోంమంత్రి తానేటి వనిత నిత్యం పర్యవేక్షిస్తున్నారు. కోనసీమ జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులతోపాటు ఇతర సిబ్బందిని మోహరించారు. అల్లర్లకు కారణమైన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి వివరాలను సేకరిస్తున్నారు. మరికొంత మందిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటన వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తప్పవంటున్నారు.
 


 


Also read:CM Jagan tour: దావోస్‌లో సీఎం జగన్‌ వరుస భేటీలు..పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం..!


Also read:లైఫ్‌లో కాంప్రమైజ్‌ అయ్యే ప్రసక్తే లేదు.. ఎన్నో వ‌దులుకొని ఇక్క‌డికొచ్చా: నాగ చైతన్య


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి