జనసేన పార్టీతో పొత్తు అంశంపై బీజేపీ మహిళా నేత పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ను ఇప్పటికీ తమ మిత్రుడిగానే భావిస్తున్నామని వెల్లడించారు. పవన్ పార్టీతో పొత్తుకు తమ వైపు నుంచి సిద్ధమమేనని.. ఇక తేల్చుకోవాల్సిందే ఆయనేనని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ నుంచి సానుకూల సంకేతాలు వస్తే.. పొత్తుపై నిర్ణయం తీసుకుంటామన్నారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాదిలోనూ బీజేపీ బలమైన శక్తి..


ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పురదేశ్వరీ  మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలున్నాయన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ దక్షిణాదిలో మరింత బలోపేతమవుతుందని..మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎవరూ ఊహించని రీతిలో పుంజుకుంటుదని పురందేశ్వరీ వ్యాఖ్యనించారు.