Andhra Pradesh Weather Updates: నైరుతి రుతుపవనాలు రాగల  2 రోజులలో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ & నికోబార్ దీవులలో మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విదర్భ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో  నైరుతి గాలులు వీస్తున్నాయన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రానున్న మూడు రోజులకు వాతావరణ పరిస్థితులు ఇలా..


ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ &యానాంలో బుధవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు  వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు  ఒకటి  లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు   40-50 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది. గురువారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు  వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు  ఒకటి  లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు   30-40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది. ఎల్లుండి తేలిక పాటి నుంచి ఒక మోస్తరు  వర్షాలు ఒకటి  లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తా  ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలో నేడు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు  వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు  ఒకటి  లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు   40-50 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది. రేపు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు  వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు  ఒకటి  లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు   30-40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది. శుక్రవారం తేలిక పాటి నుంచిక మోస్తరు  వర్షాలు    ఒకటి  లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉంది. 


రాయలసీమ ప్రాంతంలో బుధవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు  వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు  ఒకటి  లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు   40-50 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది. గురువారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు  వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు  ఒకటి  లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు   30-40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. శుక్రవారం వాతావరణం పొడిగా ఉండే  అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


Also Read: Jagananna Vidya Deevena Funds: గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి


Also Read: LSG Vs MI Dream11 Team Prediction: ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచేదెవరు..? లక్నోతో ముంబై ఢీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook