తెలిసో తెలియకో క్షణికావేశంలోనే నేరం చేసి జైలు శిక్ష పొందుతున్న ఖైదీలు వారంతా ( Prisoners ) . కరోనా మహమ్మారి చుట్టుముట్టింది. ధైర్యంగా..పోరాడి కరోనాను జయించారు. ఒకరో ఇద్దరో కాదు..ఏకంగా 3 వందల మంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా మహమ్మారి ( Corona pandemic ) రోజురోజుకూ విజృంభిస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ( Rajahmundry Central Jail ) ఉన్న ఏకంగా 17 వందల మందికి ఆగస్టు నెలలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా...3 వందల మందికి పాజిటివ్ గా తేలింది. ఒక్కసారిగా ప్రభుత్వ యంత్రాగం ఉలిక్కిపడింది. ప్రత్యేక చర్యలు చేపట్టింది. కరోనా బారిన పడిన ఖైదీలకు ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేశారు. మిగిలిన ఖైదీలతో కలవకుండా చర్యలు చేపడుతూ జైళ్లోనే వైద్య సేవలు అందించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఖైదీలు కరోనా బారినపడిన వెంటనే పూర్తిస్థాయి వైద్యంతో పాటు బలవర్ధక ఆహారం అందించారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ పరీక్షలు నిర్వహించడంతో పాటు రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న ఖైదీలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రత్యేకంగా వైద్య సేవలందించారు. కరోనా బాధితులందరికీ చికిత్స అనంతరం పరీక్షలు చేయగా నెగెటివ్‌ వచ్చిందని జైలు అధికారులు, వైద్యులు ధ్రువీకరించారు. Also read: AP EAMCET 2020: ఏపీ ఎంసెట్‌ దరఖాస్తుకు మరో ఛాన్స్