ఈ రోజు రాజమహేంద్రవరంలోని వ్యవసాయ కాలేజీ శంకుస్థాపనకు రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే కార్యక్రమానికి వచ్చిన మరో అతిథి మరియు జిల్లామేయర్ రజనీ శేషసాయి, శంకుస్థాపన శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో కంగు తిన్నారు. తీవ్ర మనస్తాపానికి గురై మంత్రి ఎదుటే కన్నీరు పెట్టుకున్నారు. ఆయనను కలిసి తాను ఎందుకు బాధపడుతున్నారో వివరించారు. 


ఈ వైఖరి కచ్చితంగా తనను అవమానించడమే అని తెలిపారు. ప్రొటోకాల్ నియమాన్ని అధికారులు ఎందుకు పాటించలేకపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయంపై రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య స్పందించారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఆ హోదాలో ఉన్న వ్యక్తి కలత చెందడం సబబు కాదన్నారు. పబ్లిసిటీ కంటే ప్రజాసేవ ముఖ్యమనే విషయాన్ని నాయకులు గుర్తుపెట్టుకోవాలని ఆయన తెలిపారు.