Volunteers Insurance: సొంత ఖర్చుతో వాలంటీర్లకు ప్రమాద భీమా కల్పించిన ఎమ్మెల్యే రాజా
Volunteers Insurance: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా వాలంటీర్లకు ప్రమాద భీమా కల్పించే వినూత్న పథకాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది.
Volunteers Insurance: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా వాలంటీర్లకు ప్రమాద భీమా కల్పించే వినూత్న పథకాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది.
ప్రతి ఇంటి సంక్షేమం కోసం దేశంలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap ys jagan) వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేందుకు వాలంటీర్ వ్యవస్థ దోహదపడుతోంది. కొన్ని సందర్భాల్లో దురదృష్ఠవశాత్తూ ఆ వాలంటీర్లు రోడ్డు ప్రమాదంలో గాయపడటమో లేదా మరణించడమో జరుగుతోంది. అటువంటిదే ఓ సంఘటన రాజానగరం నియోజకవర్గంలో జరిగింది. నియోజకవర్గంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న కోడెల్లి లీలారాణి దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మరణించడంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా (Jakkampudi Raja)స్పందించారు. వాలంటీర్ల పరిస్థితిపై ఆలోచించారు. తన తండ్రి పేరిట స్థాపించిన జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 1575 మంది వాలంటీర్లకు ఉచితంగా తానే ప్రీమియం కట్టి..మూడేళ్లపాటు ప్రమాద భీమా కల్పించారు. ఈ కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చేవూరి హరి కిరణ్ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. వాలంటీర్లకు ఇన్సూరెన్స్ (Volunteers Insurance) పత్రాల్ని అందించారు.
[[{"fid":"220476","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jakkampudi Raja Availed insurance to volunteers","field_file_image_title_text[und][0][value]":"వాలంటీర్లకు ప్రమాద భీమా కల్పించిన జక్కంపూడి రాజా"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jakkampudi Raja Availed insurance to volunteers","field_file_image_title_text[und][0][value]":"వాలంటీర్లకు ప్రమాద భీమా కల్పించిన జక్కంపూడి రాజా"}},"link_text":false,"attributes":{"alt":"Jakkampudi Raja Availed insurance to volunteers","title":"వాలంటీర్లకు ప్రమాద భీమా కల్పించిన జక్కంపూడి రాజా","class":"media-element file-default","data-delta":"1"}}]]
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆలోచనను రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలు కచ్చితంగా ఆచరిస్తారని..అంతటి మంచి పని అని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చేవూరి హరి కిరణ్ ప్రశంసించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో నియోజకవర్గం 90 శాతంతో ముందంజలో ఉందన్నారు.
Also read: Corona in AP: ఏపీలో కొవిడ్ కల్లోలం- ఒకే స్కూల్లో 147 మందికి పాజిటివ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook