YS Jagan vs YS Sharmila: ప్రపంచవ్యాప్తంగా హిందూవులు రాఖీ పండుగను ఆనందోత్సాహాల మధ్య చేసుకుంటున్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్నా కూడా రాఖీ పండుగ రోజు కుటుంబసభ్యులు కలుసుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రాజకీయ విభేదాలు ఏర్పడిన వేళ ఆ కుటుంబం రెండుగా చీలింది. గతంలో కలిసి ఉన్న అన్నాచెల్లెలు ఇప్పుడు బద్ద శత్రువులుగా మారిపోయారు. ఎన్ని విభేదాలు ఉన్నా సంవత్సరానికి ఒకసారి వచ్చే రాఖీ పండుగ రోజు కలిసిపోతారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అన్నాచెల్లెలు రాఖీ పండుగ రోజు కూడా కలవనంత శత్రువులుగా మారారు. వారే మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకురాలు వైఎస్‌ షర్మిల.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: RK Roja Arrest: ఆడుదాం ఆంధ్రాలో అవినీతి.. ఆర్‌కే రోజా అరెస్ట్‌కు రంగం సిద్ధం?


సొంత కూతురిలా..
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అన్నాచెల్లెలు అంటే మొదటగా గుర్తుకొచ్చేది కేటీఆర్‌, కవిత. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌, షర్మిల గుర్తుకు వస్తారు. ఐదేళ్ల కిందటి వరకు జగన్‌, షర్మిల అన్యోన్యంగా ఉండేవారు. ఎంతో ప్రేమానురాగాలతో.. వివాహాలు జరిగి వేర్వేరు కుటుంబాలుగా మారినా తరచూ కలిసేవారు. తాడేపల్లిలోని నివాసంలోనే జగన్‌, షర్మిల ఉండేవారు. షర్మిలను కన్న తండ్రి మాదిరి జగన్‌ చూసుకునేవారు. ఇదే విషయాన్ని షర్మిల చాలాసార్లు బహిరంగ వేదికల్లో చెప్పారు. 'జగనన్న నన్ను పెద్దకూతురిలా చూసుకుంటారు. ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు' అని చాలా ఇంటర్వ్యూల్లో షర్మిల చెప్పారు.


Also Read: Duvvada Srinivas Issue: వైఎస్‌ జగన్‌ సంచలనం.. దువ్వాడ శ్రీనివాస్ రాజీనామాకు ఆదేశం? 


అన్న కష్టాల్లో తోడుగా..
ఇక షర్మిల కూడా జగనన్నతో ప్రేమగా.. అంతేకాకుండా అన్న కష్టాల్లోనూ తోడుగా నిలిచారు. కొన్ని కేసుల్లో అరెస్టయ్యి జైల్లో ఉంటే జగనన్నకు అండగా షర్మిల రాజకీయ బాధ్యతలను చేపట్టారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను షర్మిల విజయవంతంగా చేపట్టారు. తన తండ్రి వైఎస్సార్‌, అన్న జగన్‌ మాదిరి షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇలా అన్న కష్టసుఖాల్లో పాలుపంచుకున్న షర్మిల ఐదేళ్ల కిందట అనూహ్యంగా అన్న నుంచి దూరమయ్యారు. అధికారంలోకి వచ్చాక జగన్‌తో షర్మిలకు భేదాభిప్రాయాలు వచ్చాయి. అనంతరం తెలంగాణలోకి ప్రవేశించి షర్మిల కొత్త పార్టీ పెట్టుకుని విఫలమయ్యారు.


ఐదేళ్ల నుంచి దూరం
అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి ప్రవేశించి సొంత అన్న జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల పని చేయడం ప్రారంభించారు. తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిన కాంగ్రెస్‌ పార్టీలోనే చేరి అధ్యక్షురాలిగా షర్మిల మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగనన్నకు వ్యతిరేకంగా షర్మిల పని చేశారు. చివరకు అన్నను అధికారంలో నుంచి దించేయడంలో షర్మిల ప్రముఖ పాత్ర పోషించారు. అయినా కూడా షర్మిలకు అన్న మీద కోపం తగ్గనట్టు కనిపిస్తోంది. ఈ రాఖీ పండుగకు కూడా జగన్‌ను షర్మిల కలవడం లేదు. గతంలో ప్రతి రాఖీ పండుగకు జగన్‌కు షర్మిల రాఖీ కట్టేవారు. అలాంటిది రాజకీయంగా విభేదాలు వచ్చాక షర్మిల జగన్‌ ఇంటి ముఖం వైపు చూడడం లేదు. దాదాపు ఐదేళ్లుగా జగన్‌కు షర్మిల రాఖీ కట్టడం లేదు. అన్నాచెల్లెలు చివరిసారిగా ఈ ఏడాది షర్మిల కుమారుడి పెళ్లిలో కలుసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ ఇప్పటివరకు కలవలేదు. ఈ రాఖీ పండుగ రోజు కూడా అన్నాచెల్లెలు కలవలేదు. దీంతో వైఎస్‌ అభిమానులు నిరాశ చెందుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter