Ramoji Rao Passes Away: పాత్రికేయ రాజకీయ రంగంలోనే కాదు సినీ రంగంలో రామోజీరావు ముద్ర.. ప్రధాని మోడీ సహా పలువురు నేతల సంతాపం..
Ramoji Rao: రామోజీ రావు ఇది ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్. ఈనాడు పేపర్ తో అంచలంచెలుగా ఎదిగి తెలుగు రాజకీయాలను తన కలంతో శాసించిన అక్షర శిల్పి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ రావు ఈ రోజు ఉదయం కన్నుమూసారు. ఆయన మరణంతో తెలుగు పత్రికా రంగం పెద్ద దిక్కును కోల్పోయింది.
Ramoji Rao: రామోజీ రావుకు తెలుగు ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉంది. రోజు ఉదయం చదివే ఈనాడు దినపత్రిక. అటు మీడియా రంగంలో ఈటీవీ వంటివి తెలుగు ప్రజలతో పెనువేసుకుపోయింది. అంతేకాదు.. ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడిగా.. ప్రచురణకర్తగా.. అటు చిట్ ఫండ్ రంగంలో మార్గదర్శి చిట్ ఫండ్స్.. పచ్చళ్ల వ్యాపారంలో ప్రియా పచ్చళ్లు.. అటు కళాంజలి..ఉషా కిరణ్ మూవీస్ అధినేతగా పలు విజయ వంతమైన చిత్రాల నిర్మాతగా తెలుగు ప్రజలతో ఆయన అనుబంధం ముడిపడి ఉంది. అంతేకాదు ప్రపంచంలో అందరు అబ్బుర పరిచే వరల్డ్ లోనే అతిపెద్ద సినీ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీతో కూడా ఆయన తనదైన ముద్ర వేసారు. ఇక్కడ తెలుగు, హిందీ, వివిధ భాషల చిత్రాలతో పాటు హాలీవుడ్ సహా పలు అంతర్జాతీయ సినీ ప్రియులు ఇక్కడ షూటింగ్ కోసం ఇక్కడి వచ్చి సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకోవడం వంటివి రామోజీ దార్శనికతకు నిదర్శనం. తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలకు చేసిన సేవలకు గాను 2016లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయనకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ తో గౌరవించింది.
ఆయన మృతితో తెలుగు పాత్రికేయ రంగానికి తీరని లోటు. అప్పట్లో అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడంలో రామోజీకి చెందిన ఈనాడు కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత అన్నగారి పదవీచ్యుతుడు కావడంతో పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా గద్దెను ఎక్కడంలో రామోజీకి చెందిన ఈనాడు కీలక భూమిక వహించిందని రాష్ట్రంలోని సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అంతేకాదు ఈయన్ని కొంతమంది రాజగురువుగా అభివర్ణిస్తుంటారు. అంతేకాదు తెలుగు పాత్రికేయ రంగంలో మీడియా మొఘల్ గా అభివర్ణిస్తుంటారు. 1936 నవంబర్ 16న సామాన్య రైతు కుటుంబంలో జన్మిచంిన రామోజీ.. 87 యేళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసారు.
రామోజీ రావు మృతిపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, చిరంజీవి సహా పలువురు రాజకీ నేతలు, సినీ ప్రముఖుఉ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అటు సినీ రంగంలో చిరంజీవి సహా పలు సినీ తారలు రామోజీ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also read: Attack on Varma: ఇది ప్లాన్ ప్రకారం జరిగిన హత్యాయత్నమేనంటున్న మాజీ ఎమ్మెల్యే వర్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook