Rash Driving Case filed on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ లో కేసు నమోదవడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కారుపై రాష్ డ్రైవింగ్ కింద కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఇప్పటం అనే గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు చేయాలని చెబుతూ కొన్ని ఇళ్లు ధ్వంసం చేసినట్లు ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు ఇప్పటం గ్రామస్తులు తమ పొలాలను పవన్ కళ్యాణ్ కు అప్పగించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత ప్రభుత్వం తమ మీద కక్ష కట్టి ఎక్కడా లేనివిధంగా 120 అడుగుల రోడ్డు వేస్తామని చెబుతూ తమ ఇళ్లను ధ్వంసం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా హైకోర్టు దాని మీద స్టే విధించింది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామాన్ని సందర్శించే నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్లలో ర్యాలీగా మంగళగిరి నుంచి ఇప్పటం వెళ్లారు. అయితే ఆ సమయంలో పవన్ ఒక కారు టాప్ మీద కూర్చుని ప్రయాణించడం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయింది. ఈ విషయం మీద జాతీయ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి.


అయితే ఇప్పుడు ఇదే విషయం మీద ఆయన మీద కేసు నమోదునట్లుగా తెలుస్తోంది. ఇప్పటం గ్రామానికి చెందిన శేషగిరిరావు పంతగాని అనే వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాను తన బంధువుల ఇంటికి వెళుతుండగా సుమారు 9:30 గంటల సమయంలో రైల్వే వంతెన దాటేసరికి నేషనల్ హైవే రోడ్డు వైపు నుంచి ఒక్కసారిగా జనసేన పార్టీ కార్యకర్తలు అనేక కార్లు, బైకులలో ర్యాలీగా ఇప్పటం రోడ్డు వైపుకు అజాగ్రత్తగా అతి వేగంగా నడుపుతూ నిర్లక్ష్యంగా వెళ్లారని అన్ని వాహనాలు ఒక్కసారిగా వేగంగా  ఇప్పటం వైపు వెళ్లేసరికి నేను నా బైక్ ని కంట్రోల్ చేయలేక కింద పడిపోయానని అతను ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఆ వాహనాలు అన్నిటికంటే ముందుగా టీఎస్ జీరో సెవెన్ జి జి 2345 అనే నెంబర్ గల తెల్ల కారులో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళుతున్నారని ఆయన కారు పైన కూర్చుని ఉండగా అదే కారుకు కొంతమంది అటు కొంతమంది ఇటు వేలాడుతూ అలానే ఇప్పటం వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సదరు కారు డ్రైవర్ ఎవరో తెలియదని రాష్ డ్రైవింగ్ చేస్తున్నందుకు అతనిపైన కారు పైన కూర్చున్నందుకు పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదు చేయాలంటూ అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే జనసేన ఇంకా ఈ విషయం మీద స్పందించలేదు. 


Also Read: Anikha Surendran Hot Photos: హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న టీనేజ్ గర్ల్.. లైన్లోకి వచ్చానంటోందిగా!


Also Read: Pooja RamaChandran Pregnant: తల్లి కాబోతున్న పూజా రామచంద్రన్.. భర్తతో లిప్ లాక్స్ పెట్టుకుంటూ అనౌన్స్ చేసిందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook