ఏపీ ఎన్నికల ఫలితాలపై రేవంత్ రెడ్డి రియాక్షన్
దేశ ఎన్నికల ఫలితాల కంటే ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణలో కూడా ప్రధానం ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. ఏపీ ఫలితాల విషయంలో జాతీయ స్థాయిలో వస్తున్న పలు సర్వేలు కూడా జనాల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే ప్రశ్న టి.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఎదురైంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు....ఏపీ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని.. పక్క రాష్ట్ర రాజకీయాల గురించి తెలియదు అంటూ రేవంత్ సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో రేవంత్ రెడ్డి మాల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్రచారంలో టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు సంధిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు రేవంత్ రెడ్డి ఈ మేరకు సమాధానం ఇచ్చారు