High Temperatures in AP: రోహిణి కార్తె కాలంలో రోళ్లు పగిలేంత ఎండలు ఉంటాయంటారు.. అందుకు తగినట్లే భానుడి తన ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటిపూట బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఏపీలోని పలు జిల్లాలో వడగాల్పులు వీస్తాయని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లూరి జిల్లాలోని నెల్లిపాక, చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని చెప్పారు. వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మండలాలు, ఏలూరు జిల్లా కుకునూర్, మన్యంజిల్లాలోని కొమరాడ  మండలంలో కూడా తీవ్ర వడగాల్పులు ఉంటాయని తెలిపారు. 256 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. రేపు 127 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందన్నారు.


శుక్రవారం పల్నాడు జిల్లా ఈపూర్, విజయనగరం జిల్లా కనిమెరకలో 44.9°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆయన తెలిపారు. 10 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 105 మండలాల్లో వడగాల్పులు వీచాయని చెప్పారు. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. రేపు కొన్ని ప్రాంతాల్లో 44°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా  ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని చెప్పారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


Also Read: Ruturaj Gaikwad-Utkarsha Pawar: ధోని పాదాలను తాకిన రుతురాజ్‌ కాబోయే భార్య.. నెట్టింట వీడియో వైరల్


కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో క్షతగాత్రుల సమాచార వివరాల కోసం విపత్తుల సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ 24/7 కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఏర్పాటు చేసినట్లు బీఆర్ అంబేద్కర్ తెలిపారు. 1070, 112, 18004250101 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. 


==> ఒడిశా, బాలసోర్ - 06782-262286
==> విజయవాడ - 0866 2576924
==> రాజమండ్రి - 08832420541
==> సామర్లకోట - 7780741268
==> నెల్లూరు - 08612342028
==> ఒంగోలు -7815909489
==> గూడూరు -08624250795
==> ఏలూరు -08812232267


Also Read: Odisha Train Accident: ఒడిశా ఘటనపై ఏపీ సీఎం జగన్ రివ్యూ, ఏపీ నుంచి ప్రత్యేక బృందం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి