Srisailam: కొలువుదీరిన శ్రీశైలం కొత్త పాలక మండలి.. చైర్మన్ గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి
కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న శ్రీశైలం దేవస్థానం పాలకమండలిలో కొత్తగా ట్రైబల్స్ కు స్థానం కల్పించి, 15 మంది సభ్యులతో కూడిన పాలక మండలి ప్రమాణస్వీకారం చేశారు. శ్రీశైలం పాలక మండలి చైర్మన్ గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
Srisailam Devasthanam: శ్రీశైలం దేవస్థానం నూతన పాలకమండలి కొలువుదీరింది. ప్రభుత్వం పాలకమండలిని నియమిస్తూ జీవో విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో హడావిడిగా పాలకమండలి ప్రమాణస్వీకారం చేసింది. పాలకమండలి ఛైర్మన్ గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
నిజానికి ఈ ప్రమాణస్వీకారం 2021 ఫిబ్రవరి 14న జరగాల్సి ఉండగా.. హై కోర్టు ఆదేశాలతో వాయిదా పడింది. అయితే నిబంధనల ప్రకారం, ఆలయ పాలక మండలిలో గిరిజనలకు చోటు కల్పించకపోవడం మరియు పాలక మండలిలో ఇద్దరు హిందూ ధార్మిక తాత్వికవెత్తలకు చోటు కల్పించక పోవటం వల్ల కర్నూలు జిల్లా గుగుంజాయ్ తండాకు శ్రీనివాసులు నాయక్ హైకోర్టు ను ఆశ్రయించటంతో.. దేవాలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యుల ప్రమాణస్వీకారంపై న్యాయస్థానం స్టే విధించింది.
దీంతో కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న శ్రీశైలం దేవస్థానం పాలకమండలిలో కొత్తగా ట్రైబల్స్ కు స్థానం కల్పించారు. పాలకమండలిలో గిరిజనులను సభ్యులుగా చేరుస్తూ జాబితా పేర్లను విడుదల చేసింది ప్రభుత్వం. దీంతో శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న నూతన పాలకమండలి చైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. 15 మంది సభ్యులు దేవస్థానం నియమ నిబంధనలకు లోబడి ప్రమాణం చేశారు. శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: RRR Movie Collections: ఆర్‌ఆర్‌ఆర్ తొలిరోజు కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాకే!!
Also Read: RRR Mania: తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మానియా.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook