Remal Cyclone Alert: నైరుతి రుతుపవనాలు క్రమంగా సముద్రమంతా విస్తరిస్తున్నాయి. మే 19 అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించిన రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతం సహా ఆగ్నే, మధ్య బంగాళాఖాతంలో, ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.. మరోవైపు తుపాను ప్రభావం కారణంగా ఏపీలో రానున్న రెండు మూడ్రోజులు వర్షసూచన ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో వాయుగుండం తుపానుగా మారింది. రెమల్‌గా ఈ తుపానుకు నామకరణం చేశారు. ఇవాళ  తీవ్రతుపానుగా మరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బంగ్లాగేశ్ సరిహద్దుకు ఆనుకుని అర్ధరాత్రి దాటిన తరువాత తీరం దాటవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. దీనికితోడు బంగాళాఖాతంలో ఆవహించిన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. సముద్రంలో శ్రీకాకుళం జిల్లా, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ, తిరుపతి జిల్లాల్లోనూ మోస్తరు వర్షం నమోదైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అత్యదికంగా 86.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాల్లో సరాసరిన 40 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. తూర్పు గోదావరి జిల్లాలో ఆకాశం మేఘావృతంగా ఉన్న వర్షం పడలేదు. నరసరావుపేటలో మోస్తరు వర్షం కురిసింది.  పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. ఏలూరు, జంగారెడ్డిగూడెం, కైకలూరు, నూజివీడు, మొగల్తూరు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. కర్నూలు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా పడ్డాయి. 


వాతావరణం అనుకూలంగా ఉన్నందున ఊహించినట్టే నైరుతి రుతుపవనాలు ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకనున్నాయి. అక్కడ్నించి క్రమంగా దక్షిణ భారతదేశంలో ప్రవేశించి విస్తరించనున్నాయి. అంటే మొదటి వారం నుంచే దక్షిణాదిలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. రాగల రెండ్రోజుల్లో ఏపీలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 


Also read: JEE Advanced 2024: రేపే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, నిమిషం ఆలస్యమైనా అనుమతించరు జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook