Tirupati Bypoll: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్ధుల్లో అత్యంత ధనికులెవరు..నామినేషన్ అఫిడవిట్‌లో ఎవరి ఆస్థులెంత ఉన్నాయి..ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక (Tirupati Bypoll) నామినేషన్లు ముగిశాయి. నామినేషన్లతో పాటు నిబంధనల ప్రకారం ఆస్థుల వివరాలతో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఆ అఫిడవిట్ ప్రకారం తిరుపతి లోక్‌సభ బరిలో నిలిచిన అభ్యర్ధుల్లో ఎవరి ఆస్థి ఎంత, ఎవరు ధనికులనే వివరాలు బహిర్గతమయ్యాయి. ఆ పార్టీ అభ్యర్ధి అందరికంటే ధనవంతులంటే ఆశ్చర్యపోవల్సిందే. 


తిరుపతి లోక్‌సభ బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చింతా మోహన్ తనకు ఆస్తులు లేవని తెలిపారు. అటు టీడీపీ అభ్యర్ధి మాజీ మంత్రి పనబాక లక్ష్మి మాత్రం భర్తతో కలిసి పదికోట్లు ఉన్నట్టు ప్రకటించారు. ఇక అధికారపార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ (Ysr Congress party) అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి తనకు 40 లక్షల ఆస్థి ఉన్నట్టు తెలిపారు. ఇక ఈ అందరికంటే ఎక్కువగా బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్ధి మాజీ ఐఏఎస్ అధికారిణి మాత్రం అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. మొత్తం 25 కోట్ల ఆస్థులున్నట్టు తెలిపారు. కర్ణాటక ఛీప్ సెక్రటరీగా పనిచేసిన రత్నప్రభ 2019-20 మధ్య కాలంలో ఆదాయం 39.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇక తల్లి నుంచి సంక్రమించిన ఆభరణాల విలువ 52 లక్షలని తెలిపారు. 


తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్థులలో బీజేపీ- జనసేన (Bjp-Janasena)ఉమ్మడి అభ్యర్థి, మాజీ ఐఏఎస్‌ అధికారిణి అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. తనకు మొత్తంగా రూ. 25 కోట్ల విలువ గల ఆస్తి ఉన్నట్లు ప్రకటించారు. గతంలో కర్ణాటక చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన ఆమె, 2019-20 మధ్యకాలంలో తన ఆదాయం రూ. 39.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇక తన తల్లి నుంచి సంక్రమించిన బంగారు ఆభరణాల విలువ రూ. 52 లక్షలు అని తెలిపారు.


రత్నప్రభ (Ratnaprabha) మొత్తం ఆస్తి 25 కోట్లు కాగా ఆమె సొంత ఆస్థులు 19.7 కోట్లైతే బ్యాంకు డిపాజిట్ విలువ 2.8 కోట్లుగా ఉంది. బంగారు ఆభరణాల విలువ 52 లక్షలు కాగా చరాస్థుల విలువ 3.5 కోట్లుగా ఉంది. భూమి, భవనాలు, ఇళ్ల స్థలాలు, ఇతర స్థిరాస్థుల విలువ 16.2 కోట్లుగా ఉంది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో మొత్తం 33 మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన రాజకీయల పార్టీలతో పాటు ఇతరులు కూడా భారీగా నామినేషన్ దాఖలు చేశారు. 


Also read: AP SEC: నిమ్మగడ్డకు నో అప్పాయింట్మెంట్, తీవ్ర నిరాశలో ఎస్ఈసీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook