మహిళల కోటాలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే నారా లోకేష్‌కి తెలుగుదేశం నాయకులు మంత్రి పదవి కట్టబెట్టారని వైఎస్సార్‌సీపీ శాసనసభ్యురాలు రోజా సెల్వమణి ధ్వజం ఎత్తారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఏపీ ప్రవేశబెట్టిన బడ్జెట్‌‌లో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళల సమస్యల గురించి చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ గురించే చెప్పుకోవాలని ఆమె అన్నారు.


చంద్రబాబు పాలనలో మహిళల అక్రమరవాణాలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానానికి ఎగబ్రాకిందని ఆమె తెలిపారు. మహిళా మండల రెవెన్యూ ఆఫీసర్ వనజాక్షిపై దాడి జరిగినా పట్టించుకొనే నాథుడే లేకపోయాడని... అలాగే మహిళల కోటాలోనే తన తనయుడు నారా లోకేష్‌కి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి కట్టబెట్టారని ఆమె ఆరోపించారు. నారా లోకేష్‌కి ఐటి మినిస్టర్ పదవి కట్టబెట్టినంత మాత్రాన.. రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గినట్లు కాదని రోజా అభిప్రాయపడ్డారు