విజయవాడ: దసరా సెలవుల దృష్ట్యా విద్యార్ధుల కోసం స్పెషల్‌ బస్సులు నడపాలని APSRTC నిర్ణయించింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం విద్యార్ధులను ఇళ్లకు చేర్చేందుకు  ఒక్క విజయవాడ రీజియన్ పరిధి నుంచే దాదాపు 1700 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. నూటికి 90 శాతం కళాశాలు.. అక్టోబరు 13న సెలవులు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. విద్యార్ధుల సౌకర్యార్ధం పెద్ద క్యాంపస్‌లకు పిల్లల్ని వదిలే సమయానికి నేరుగా సిటీబస్సులను పంపించాలని భావిస్తన్న ఆర్టీసీ... మిగిలిన కళాశాలలకు సమీపం బస్టాప్‌ పాయింట్ల వద్ద అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.


ఆర్ధిసీ లెక్కల ప్రకారం.. విజయవాడ పరిసర ప్రాంతాల్లో దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు బయటి నుంచి వచ్చి చదువుకుంటున్నారు. వీరిలో కొందరు సొంత కార్లలోను, క్యాబ్‌ల్లో వెళ్లిపోతారు.. మరో లక్ష మంది రైళ్లలో వెళ్లిపోతారు. ఇక మిగిలిన 2 లక్షల మంది బస్సుల్లో ఇళ్లకు చేరుతున్నారు. ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో ప్రయాణిస్తున్నందన బస్సులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను దృష్ట్యిలో పెట్టుకొని APSRTC ఈ మేరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే రద్దీని బట్టి అప్పటి కప్పుడు నిర్ణయం తీసుకోనుంది.