అమరావతి: ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు హెచ్చరించారు. ఈ రెండు జిల్లాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాల్సిందిగా అధికారులు విజ్ఞప్తిచేశారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని కురుపాం మండలంలో పిడుగులు పడే అవకాశం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. 


శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, హిర మండలం, ఎల్ఎన్‌ పేట, సీతంపేట, పాతపట్నం, మెళయాపుట్టి మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు హెచ్చరించారు.