Sajjala Ramakrishna Reddy on MLC Elections: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి పెను షాక్ తగిలింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టిడిపి కనీసం చేసుకోగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానం కూడా సైకిల్ పార్టీ కైవసమైంది. పశ్చిమ పట్టభద్రుల స్థానంలో కూడా టిడిపి అభ్యర్థి ముందంజలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ విషయం మీద ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ  టీడీపీవి కావని, పీడీఎఫ్, ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే టిడిపి వైపు మళ్ళాయని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నిటినీ కలిపి చూడాలని పేర్కొన్న సజ్జల ఏం రకంగాను ఈ ఎన్నికలు  ప్రభుత్వ వ్యతిరేకతను ఎత్తి చూపించేవి కావని అన్నారు. టిడిపి సంబరాలు చేసుకోవటంతోనే అంతా అయిపోలేదని పేర్కొన్న సజ్జల ఈ ఫలితాలను మేము హెచ్చరికగా భావించడం లేదని అన్నారు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని, ఒక వర్గం ఓటర్లను మొత్తానికి ఎలా అపాదిస్తారు? అని ఆయన స్పందించారు. ఇక మేము అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లలో లేరని పేర్కొన్న ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షా 30 వేల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు.


మొన్ననే కానిస్టేబుల్ పోస్టులకు రిక్రూట్మెంట్ కూడా చేశామని పేర్కొన్న సజ్జల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేసిందని అన్నారు. తెలంగాణ తరహాలోనే ప్రయత్నాలు టిడిపి చేయవచ్చని పేర్కొన్న ఆయన చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడని పేర్కొంది.


కౌంటింగ్ లోనూ టీడీపీ పాల్పడిన అవకతవకలను ఎన్నికల అధికారులు గుర్తించారని, గ్రాడ్యుయేట్స్ లో మాకు ఓట్లు బాగానే వచ్చాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ ఓట్లను టీడీపీకి బదిలీ చేశాయని సజ్జల అన్నారు. మేము మొదటి సారి టీచర్ ఎమ్మెల్సీ ల్లో పోటీ చేసి గెలవగలిగామని, గ్రాడ్యుయేట్స్ లో కింది స్థాయిలో తీసుకుని వెళ్ళటం లో కొంత వెనుకబడ్డామని ఆయన అన్నారు.


Also Read: Taraka Ratna Wife Emotional: నువ్ రియల్ హీరో ఓబు.. ఆ గుండె అన్నీ భరించింది.. తారకరత్న వైఫ్ అమోశానల్ పోస్ట్!


Also Read: Rain Fall Allert: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు కుండపోతే.. హైదరాబాద్లో పరిస్ధితి ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook