Sajjala on Pawan: చప్పట్లు కొట్టించుకునేందుకు ఏదేదో మాట్లాడుతున్నాడు కానీ అంతా అక్కడి స్క్రిప్టే!
Sajjala Ramakrishna Reddy : పవన్ కళ్యాణ్ మీద ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు, పవన్ కళ్యాణ్ అజెండా బాబు కోసమే అంటూ ఆయన ఘాటుగా కామెంట్లు చేశారు. ఆ వివరాలు
Sajjala Ramakrishna Reddy Slams Pawan Kalyan: సత్తెనపల్లిలో రైతుల సభ ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ మీద ప్రభుత్వం నుంచి కౌంటర్లు గట్టిగానే వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పవన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీని అధికారంలోకి రానివ్వనని పవన్ మాట్లాడుతున్నారు కానీ అసలు ఎవరికి అధికారం ఇవ్వాలన్నది జనమే నిర్ణయం తీసుకుంటారని సజ్జల అన్నారు.
అధికారం ఎవరికి ఇవ్వాలనేది తేల్చేది పవన్ కళ్యాణ్ కాదని, సంక్షేమ పథకాలు వద్దని ప్రజలు అనుకుంటే జగన్ సీఎం కాకుండా ఆపడం సాధ్యమవుతుందని అన్నారు. అపరిపక్వత, మూర్ఖత్వం, అఙానంతో పవన్ మాట్లాడుతున్నారన్న సజ్జల అసలు పవన్ ఎవరి తరపున మాట్లాడుతున్నారో అందరికీ అర్థం అవుతుందన్నారు. తాను చంద్రబాబు తరపున మాట్లాడుతున్నట్లు పవన్ కళ్యాణ్ ధైర్యంగా చెప్పాలని డిమాండ్ చేసిన సజ్జల తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును పవన్ కళ్యాణ్ పల్లెత్తు మాట్లాడటం లేదని అన్నారు.
సినిమా అభిమానులతో చప్పట్లు కొట్టించుకునేందుకు పవన్ ఏదేదో మాట్లాడుతున్నారని, అసలు ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని పవన్ మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటి దాకా లక్ష 30 వేల సచివాలయ ఉద్యోగాలను సీఎం జగన్ ఇచ్చారని పవన్ తెలుసుకోవాలని అన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏజెంట్...చంద్రబాబు తయారు చేసిన స్క్రిప్ట్ పవన్ చదువుతున్నారని విమర్శించినా సజ్జల కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా సీఎం సహాయం అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పాల్ రావచ్చు, పవన్ కళ్యాణ్ రావచ్చు, పోటీ చేయవచ్చని సజ్జల అన్నారు.
అవినీతికి హాలిడే ఇచ్చారని పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగులు మాట్లాడుతున్నారని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను పవన్ చూసి ఇలా మాట్లాడుతున్నారని సజ్జల అన్నారు. చంద్రబాబు నిజస్వరూపం మాచర్లలో బయటపడిందని పేర్కొన్న సజ్జల 7 హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న బ్రహ్మారెడ్డిని చంద్రబాబు ఎందుకు మాచర్లలో తెచ్చిపెట్టారు? మాచర్లలో దాడులను చంద్రబాబు రెచ్చగొట్టి చేయించారని ఆరోపించారు. పిన్నెల్లి కుటుంబం రెండు దశాబ్దాలుగా రాజకీయంగా ఉన్నా ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు లేవని, మాచర్ల చంబల్ లోయ అయిందని ప్రచారం చేయడం సరైెంది కాదని అన్నారు.
అసలు అక్కడ వైసీపీ కార్యకర్తలే తగుల బెట్టారని ఎలా అనుకుంటారు?? నిజాలు విచారణలో తేలుతాయి కదా అని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గతంలో కూడా వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాను అన్నారు కానీ ఏం జరిగిందో రాష్ట్రం చూసిందని అన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రజలు నిర్ణయిస్తారన్న స్పృహ పవన్ కళ్యాణ్‌కు లేదని, జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసేది పవన్, చంద్రబాబు కాదు లబ్దిదారులైన రైతులు, వృద్ధులు, మహిళలు, డ్వాక్రా మహిళలు వద్దనుకుంటేనే అది సాధ్యం అవుతుందని అన్నారు.
జగన్ కుడా నేను చేసిన సేవ బాగుంటేనే ఓట్ వేయమని అడుగుతున్నారని సజ్జల పేర్కొన్నారు. ఇక ఒక్కోసారి పవన్ ఒక్కోలాగా మాట్లాడతారని, కానీ టీడీపీని మాత్రం ఎప్పుడూ ఒక్క మాట అనరని సజ్జల పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా అని అడుగుతున్నారు కానీ లక్షకు పైగా సచివాలయ ఉద్యోగాలు, వైద్య ఆరోగ్య శాఖ లో 40 వేల ఉద్యోగాలు పవన్ కళ్యాణ్‌కి కనిపించటం లేదని అన్నారు.
Also Read: PMGKAY: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. ఆ పథకం గడువు మళ్లీ పెంపు..?
Also Read: Rashi Khanna Pics: పట్టు చీరలో రాశీ ఖన్నా.. వేరే లెవెల్లో ఢిల్లీ భామ అందాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.