హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు  సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా  పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలతో ఆకర్షణీయంగా మారాయి.రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో, గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. సాధారణ రోజుల్లో ఇళ్ళు, అపార్ట్‌మెంట్‌లలో చిన్నపాటి ముగ్గులతో సరిపెడతారు. కానీ, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రంగు, రంగులతో ముగ్గులు వేయడంతో ఉత్సహభరితమైన వాతావరణం ఏర్పడింది.


అంతే కాకుండా కొన్ని వ్యాపార సంస్థల నిర్వహకులు నగరాల్లో తమ వ్యాపార సముదాయల్లో పూర్తి పల్లెవాతవరణం కనింపించే విధంగా చేసి కోనుగోలు దారులను ఆకర్షిస్తున్నారు. హోటల్ నిర్వాహకులు సైతం భోగి స్పెషల్ పేరుతో ప్రత్యేక వంటకాలను తయారు చేసి‘ పల్లె రుచుల’ పేరుతో ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నారు. ఈ విధంగా జిల్లా,నగర కేంద్రాల్లో ఎవరికి తోచిన విధంగా వారు భోగి, మకర సంక్రాంతి పండగ ప్రత్యేకతను ప్రదర్శించండంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..