Sarva Darshan Tickets: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనం టికెట్ల కోసం తప్పని పడిగాపులు!
Sarva Darshan Tickets: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కొండకు భక్తులు పోటెత్తారు. అలిపిరిలో సర్వదర్శనం టికెట్ కౌంటర్ దగ్గర టౌకెన్ల కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. వీకెండ్ కావడం వల్ల ఎక్కువ మంది భక్తులు విచ్చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
Sarva Darshan Tickets: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు పోటెత్తారు. దీంతో సర్వదర్శనం టికెట్ల కోసం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద క్యూలైన్లు రద్దీగా మారాయి. వారంతం కావడం వల్ల ఎక్కువ మంది భక్తులు తిరుమలకు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు తిరుమల కింద అలిపిరి వద్ద ఉన్న వాహానాల తనిఖీ కేంద్రం వద్ద కూడా బాగా రద్దీ పెరిగింది. దీంతో భక్తులు ఎక్కువ సమయం నిరీక్షిచక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొంతమంది చేసేదేమి లేక లగేజీలను కౌంటర్లలో ఇచ్చి.. మెట్ల మార్గంలో తిరుమల చేరుతున్నారు.
బ్రేక దర్శనాలు రద్దు..
అయితే మార్చి 29న తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలే ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆ రోజున కోయిల్ అళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నేపథ్యంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మార్చి 28న వీఐపీ సిఫారసు లేఖలను కూడా స్వీకరించబోమని స్పష్టం చేశారు.
Also Read: AP New Districts: ఏపీ కొత్త జిల్లాలపై 4-5 రోజుల్లో తుది నోటిఫికేషన్ విడుదల
Also Read: Srisailam: కొలువుదీరిన శ్రీశైలం కొత్త పాలక మండలి.. చైర్మన్ గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook