ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దర్శి మండలం చింతలపాడు వద్ద స్కూలు బస్సు టర్నింగ్ తీసుకోబోయి పంట కాల్వలోకి వెళ్లి  తిరగబడింది. దీంతో బస్సులో ఉన్న చిన్నారులంతా హహాకారాలు చేశారు. దీంతో అక్కడే పొలంలో పనిచేసుకుంటున్న రైతులు, అటుగా వెళుతున్న జనాలు పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలను తిరగబడ్డ బస్సు నుంచి వెంటనే చిన్నారులకు బయటకు తీశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ మీడియా కథనం ప్రకారం ప్రమాదం జరిగిన బస్సులో మొత్తం 15 మంది విద్యార్ధులు ఉండగా 11 మంది చిన్నారులకు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు స్పల్పంగా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులకు దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


కాగా ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. టర్నింగ్ ఉన్నపన్పటికీ  వేగంగా నడపడం వల్లే బస్సు అదుపు తప్పి పంట కాల్వలోకి పల్టీ కొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరగడంలో డ్రైవర్  నిర్లక్ష్యంపై పోలీసులు ఆరా తీసున్నారు. ఇదిలా ఉంటే గాయపడ్డ చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెబుతున్నారు