Kadapa RIMS: కడప రిమ్స్ వివాదాలు రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. ఈ  వివాదం కేంద్రంగా మారింది. కొన్ని రోజుల నుంచి రిమ్స్‌లో జరిగే  ప్రతీ అంశం వివాదంగా  మారుతోంది. అయితే ఈ కొత్త వివాదం రిమ్స్ డెంటల్ కాలేజిలో ప్రిన్సిపాల్ ఛాంబరుకు సీల్ వేయడం వరకూ వెళ్లింది. దీంతో రిమ్స్‌లో వివాదం పలు సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. సీల్ ను పగలగొట్టడంతో  పరిపాలనా పరంగా  ఉన్న  విభేదాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కడప రిమ్స్ దంత వైద్యశాల ఇంచార్జీగా  డాక్టర్ సురేఖ ఇటీవలే బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవలే ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా డాక్టర్ యుగంధర్‌ను  నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో యుగంధర్ బాధ్యతలు చేపట్టేందుకు  ప్రిన్సిపాల్ ఛాంబరుకు  వెళితే సీల్ వేసి ఉండడంతో ఒక్క సారిగా యుగంధర్‌ ఆశ్చర్య పోయారు. ప్రిన్సిపల్ డాక్టర్ సురేఖ అదేశాల మేరకే ఛాంబరుకు సీలు వేశామని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో చార్జ్ తీసుకోవడానికి వెళితే తాళానికి  సీల్ వేసి ఉండటంతో యుగంధర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే యుగంధర్ అక్కడే ఉన్న సిబ్బందిని ఇలా ప్రశ్నించారు..ఎవరు ఇలా ప్రిన్సిపాల్ ఛాంబరుకు సీలు వేయమన్నారని ప్రశ్నించారు.



సీల్ ఘటనతో రిమ్స్ డెంటల్ కాలేజీ లో తలెత్తిన వివాదం బహిర్గతమైంది.  అయితే ముఖ్యమైన పత్రాలు ఉన్న గదుల తాళాలకు సీలు వేయడం మామూలేనని ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ  చెప్పారు. శనివారం వేసిన  సీల్‌ను  తాను అందుబాటులో లేకపోవడం వల్ల తన ఆదేశాల మేరకే తాళాలు పగులగొట్టి అవసరమైన పత్రాలు, రికార్డులు తీసుకున్నారని వివరణ ఇచ్చారు. మరోవైపు  రిమ్స్ లో తాళాలకు  సీల్ వేసే విధానం ఎప్పుడూ లేదని చెబుతున్నారు. అధిక భద్రత ఉండే రిమ్స్ లో ఒక ఛాంబరుకు ఇలా సీల్ వేయడంతో పలువురు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Sadhvi Ritambara: ఒక్కొక్క హిందువు నలుగురిని కనాల్సిందే, సాధ్వి రితాంబర వివాదాస్పద వ్యాఖ్యలు


Also Read: Nuclear Attack: ఉక్రెయిన్‌పై ఏ క్షణమైనా అణుదాడి తధ్యం, బ్రిటన్ హెచ్చరిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook