అనంతపురం ఎంపీ, సీనియర్ నేత  జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో దాదాపు రెడ్డీ సామాజికవర్గం ఓట్లన్నీ జగకే పడ్డాయని...అయితే మహిళల రూపంలో వచ్చిన వేవ్ లో జగన్ కొట్టుకుపోయారని విశ్లేషించారు.. చాలా సైలెంట్ గా పాకిన ఈ వేవ్ ఎన్నికల సమయానికి తీవ్ర రూపం దాల్చి పూర్తి ఎన్నికలపై ప్రభావం చూపిందన్నారు. వృద్ధులు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుక పోటీ పడ్డారని...ఫలితంగా పోలింగ్ శాతం పెరిగిందన్నారు.  పసుపు కుంకుమ స్కీంతో పాటు ఫించన్ల పెంపు చాలా బాగా పనిచేసిందని జేసీ విశ్లేషించారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీమలోనూ చంద్రబాబుదే హవా


మొన్నరాత్రి వరకు అనంతపురం జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో ఓడిపోతామనుకున్నామని.. అయితే నిన్న పోలింగ్ బూత్ క్యూలో మహిళలను చూశాక ఏడు అసెంబ్లీ స్థానాలను గెలవబోతున్నామనే ధీమా కల్గిందన్నారు. రాయలసీమ ప్రాంతంలో టీడీపీ మంచి ఫలితాలు వస్తాయని... సీమలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఓ లెక్క ఇప్పుడు జరిగిన ఎన్నికలో మరో లెక్క అంటూ జేసీ చమత్కరించారు. మరి జేసీ విశ్లేషణ ఎంత వరకు కరెక్ట్ అనేది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.