Sidda Raghava Rao: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎదురు దెబ్బలు మొదలయ్యాయి. ఫలితాలతో నైరాశ్యంలోకి వెళ్లిన ఆ పార్టీ నాయకులు అసంతృప్తితో రగులుతున్నారు. ఎన్నికల ముందు కూడా అసంతృప్తులు ఉన్నా మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో కొనసాగారు. కానీ వచ్చిన ఫలితాలతో నిశ్చేష్టులయ్యారు. ఇకపై పార్టీలో కొనసాగడం కష్టమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి వికెట్‌ పడింది. పార్టీకి సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవ రావు రాజీనామా చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: జగన్‌ నా కష్టాన్నంతా బూడిదలో పోశారు.. పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో కాదు


 


ప్రకాశం జిల్లాకు చెందిన దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవ రావు వైసీపీని వీడారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి పంపారు. 2014లో చంద్రబాబు హయాంలో శిద్ధా రాఘవ రావు మంత్రిగా పని చేశారు. ఆయన 2019లో ఒంగోలు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నాడు అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీలో చేరారు.

Also Read: Palla Srinivasrao Yadav: పల్లా శ్రీనివాస్‌కే వరించిన తెలుగు దేశం అధ్యక్ష పీఠం.. ఆయన రాజకీయ చరిత్ర తెలుసా?


 


టికెట్‌ ఆశించి భంగపడి..
ఇటీవల జరిగిన ఎన్నికల్లో శిద్దా రాఘవరావు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు. దర్శి కాకుండా అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాల నుంచి పోటీ చేయాలని భావించగా జగన్‌ అంగీకరించలేదు. అప్పటి నుంచి అసంతృప్తితో రాఘవరావు ఉన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ అధికారం కోల్పోయింది. దీంతో భవిష్యత్‌ కష్టమేనని భావించిన ఆయన బయటకు వచ్చారు. అయితే జగన్‌పై ఎలాంటి విమర్శలు చేయకుండా మౌనంగా బయటకు రావడం గమనార్హం. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చిన మొదటి నాయకుడు శిద్ధా రాఘవరావు కావడం గమనార్హం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter