Social Worker Dr Praveen Chakravarthy: ఎన్నో పండుగలు ఉన్నా గణేష్ చతుర్థికి మాత్రం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా గణేష్ చతుర్థిని కాకినాడలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. గత పదిహేను సంవత్సరాలుగా ప్రముఖ సామాజిక కార్యకర్త డా.ప్రవీణ్‌ చక్రవర్తి ఈ పండుగను పురస్కరించుకుని అన్నదానం కోసం పెద్ద ఎత్తున బియ్యం విరాళంగా ఇస్తూనే ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి తన తండ్రి S.సురేష్‌ కిరణ్‌ కుమార్ చేసిన ఎన్నో దానాలు చూసి.. వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి సంవత్సరం  పెద్ద మనసుతో ప్రవీణ్ చక్రవర్తి కాకినాడ మండలంలో 60 కి పైగా గణేష్ మండపాలకు 6 టన్నులు అంటే 6 వేల కిలోల బియ్యం అందించారు. దీని ద్వారా తన సామాజిక సేవను చాటుకున్నారు. ఈ విరాళం ద్వారా అన్నదానంలో భాగంగా వేలాది మంది కడుపు నింపి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నుంచి ప్రవీణ్‌ చక్రవర్తి ప్రారంభించిన ఈ బియ్యం విరాళం పండుగ రోజు పేదవాడు కడుపునిండాలని సంతోషంగా ఉండాలని ఆయన ప్రతి సంవత్సరం విరాళం ఇస్తూ తన నిబద్ధతను చాటుకుంటూనే ఉన్నారు. సామాజిక సేవలో భాగంగా ఆయన రచనలు ఎంతో మందిని సేవా భావం వైపు ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.


గణేష్ చతుర్థి సమాజానికి సేవ చేసే అవకాశం ఇస్తుందని డా.ప్రవీణ్‌ చక్రవర్తి అన్నారు. మన సంస్కృతిలో అన్నదానానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉందని.. ప్రతి సంవత్సరం ఈ సాంప్రదాయానికి తన వంతు కృషి చేయడానికి అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టం అన్నారు. ఇలా ఎన్నో స్ఫూర్తిదాయకమైన పనులు మాటలతో కుల మత వేదన లేకుండా సమాజంలో ఐక్యతను మంచి భావాలని ఆయన పెంపొందించారు. ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో భక్తి, మంచి భావాలు నింపినట్టు అవుతుందని.. మంచి మత, సాంస్కృతిక కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు. 


గణేష్ మండపాలు ఏర్పాటు చేసి ఎంతోమందికి సేవ చేస్తున్న యువతకు ఆయన అభినందనలు తెలిపారు. వారిలో ఒకరు తమ మండపం ద్వారా ఆ వినాయకుని చల్లని ఆశీస్సులు ప్రజలకు చేరువ చేయడంతో పాటు అన్నదానం ద్వారా ఎంతో మంది కడుపు నింపడానికి డా.ప్రవీణ్ చక్రవర్తి  తమకు ఎంతో సపోర్ట్ ఇచ్చారని చెప్పారు. ఆయన గొప్ప మనసు ఈ పండగ రోజున వేలాది మందికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చిందన్నారు. 


డా.ప్రవీణ్ చక్రవర్తి అన్నదానానికి విరాళాలు ఇవ్వడం తన చేసే సామాజిక సేవలో ఒక భాగం మాత్రమే కేవలం పండగకి కాదు.. దీపావళి, ఈద్, క్రిస్మస్ ఇలా ఎన్నెన్నో పండగకి ఆయన విరాళాలు అందిస్తూనే ఉన్నారు. ఆహార విరాళాలు ఆలయ నిర్వహణ, పండగల కోసం ఆయన అందించే విరాళాలు కులం మతం లాంటి భేదాలు లేకుండా వాటికి అతీతంగా సామాజిక సేవ చేస్తూనే ఉన్నారు. సామాజిక సేవలో తనకి ఎటువంటి భేదాలు లేవని చాటుకున్నారు.


కేవలం మత పరమైన సేవా కార్యక్రమాలే కాకుండా ఉచిత విద్య, వైద్యం, మంచి నీటి బోర్లు ఇలాంటి ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కాకినాడలో గణేష్ చతుర్థి ఎల్లప్పుడూ భక్తి, ఉత్సవాలతో జరుపుకుంటారు. ప్రవీణ్‌ చక్రవర్తి రచనలు దాతృత్వ శక్తిని, అవసరమైన వారికి సేవ చేయడం ప్రాముఖ్యతను గుర్తు చేస్తాయి. గత 18 సంవత్సరాలుగా గణేష్ చతుర్థి నిజమైన స్ఫూర్తిని చెక్కుచెదరకుండా ఉంచుతూ, ఆయన ఇస్తున్న మద్దతు పండుగ, సమాజం రెండింటిలోనూ చెరగని ముద్ర వేసింది.



Disclaimer- (This article is part of IndiaDotCom Pvt Lt’s sponsored feature, a paid publication programme. IDPL claims no editorial involvement and assumes no responsibility or liability for any errors or omissions in the content of the article.)


Also Read: EPFO News: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. EPFO క్లెయిమ్స్‌ విషయంలో కీలక అప్‌డేట్..!  


Also Read: Tirumala Laddu Row: పవన్ అసలైన సెక్యులర్.. లడ్డు వివాదం వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.