ఏపీ బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీ నారాయణను బీజేపీ అధిష్టానం తొలగించింది. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిగా  పార్టీ సీనియర్ సభ్యుడైన సోము వీర్రాజును నియమించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికు చెందిన సోము వీర్రాజు దశాబ్దాలుగా సంఘ్ పరివార్ లో కొనసాగుతున్నారు. గతంలో ఇదే పదవి అందినట్టు అంది చేజారిపోయింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజుకు రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ లో మంచి పట్టుంది. విషయ పరిజ్ఞానం కూడా చాలా ఎక్కువ. అన్ని అంశాలపై సమగ్రంగా మాట్లాడగలరు. అంతేకాకుండా వ్యక్తిగతంగా సౌమ్యుడిగా ముద్ర ఉంది. రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ విఫలమయ్యారని బీజేపీ అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది. సోము వీర్రాజు నియామకంతో పార్టీ పట్టు సాధిస్తుందని కేడర్ భావిస్తోంది.


[[{"fid":"188741","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ap Bjp new president somu veerraju","field_file_image_title_text[und][0][value]":"ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ap Bjp new president somu veerraju","field_file_image_title_text[und][0][value]":"ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు"}},"link_text":false,"attributes":{"alt":"Ap Bjp new president somu veerraju","title":"ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు","class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read: ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ ఇలా మారుతున్నాయి