Somu Veerraju on CM KCR: ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. మోదీని దేశం నుంచి తరిమేస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని తప్పు పట్టారు. కుటుంబ పార్టీలు మోదీని తరిమేస్తామని మాట్లాడుతారా అంటూ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ భారత్‌ను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాడని.. కళ్లు తెరిచి ఆ అభివృద్దిని చూడాలని అన్నారు. మోదీపై మాట్లాడే అర్హత సీఎం కేసీఆర్‌కు లేదని... ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని... బీ కేర్ ఫుల్ అంటూ హెచ్చరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పులు కూడా తెచ్చుకోలేని స్థితిలో ఆస్తులు అమ్ముకుంటూ పాలన కొనసాగిస్తున్నారని సోము వీర్రాజు కేసీఆర్‌ను విమర్శించారు. సోనియా గాంధీకి సాష్టాంగ నమస్కారం చేసిన చరిత్రను అప్పుడే మరిచిపోయావా అని ప్రశ్నించారు. ఇక వైసీపీ పాలన గురించి ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి హిందువులంటే చులకనగా కనిపిస్తున్నారని విమర్శించారు. శ్రీశైలంలో రజాక్ అనే వ్యక్తి అరాచకాలు పెరిగిపోయాయని.. ఆ పుణ్యక్షేత్రానికి అతనో శాపగ్రస్తంలా తయారయ్యాడని అన్నారు. అక్కడ ప్రతీది రజాక్ కనుసన్నుల్లోనే జరుగుతుందని.. చీమ చిటుక్కుమన్నా అతనికి తెలియకుండా ఉండదని అన్నారు. 


రజాక్ అరాచకాలను ఎదిరించినందుకు డా.బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై పదుల సంఖ్యలో తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి, ప్రభుత్వం కలిసి ఆయనపై కేసులు పెట్టారని.. ఇవాళ్టి వరకు బెయిల్ రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రముఖ డాక్టర్‌పై ఇన్ని కేసులు పెట్టడానికి సిగ్గనిపించడం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇకనైనా బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.


Also Read: Shreyas Iyer: కోల్‌కతా నైట్ రైడర్స్‌ కెప్టెన్‌గా శ్రేయస్​ అయ్యర్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook