హైదరాబాద్: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తూ దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ పండగ సీజన్ లో వేర్వేరు రూట్లలో కలుపుకొని  మొత్తం 13 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సంక్రాంతి పర్వదినం జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి  సొంతూళ్లకు వెళ్లేందుకు రిజర్వేషన్లు చేయించుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే  రెగ్యులర్ రైళ్లలోని బోగీలన్నీ నిండిపోయారు.ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రత్యేక రైళ్ల వివరాలు ...


కాకినాడ, సికింద్రాబాద్ మధ్య 7 రైళ్లు, నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ కు మూడు ప్రత్యేక రైళ్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ కు 16, 17, 20 తేదీల్లో రెండేసి రైళ్లు... 18వ తేదీన ఒకటి..అలాగే  నర్సాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌ మధ్య 18, 19, 20 తేదీల్లో ఒక్కోటి.. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ కు 17న తేదీ.. సికింద్రాబాద్‌ నుంచి కాకినాడకు 13, 20 తేదీల్లో ఒక్కో రైలును నడపనున్నారు. కాగా ఈ రైళ్లలో ప్రయాణించే వారి నుంచి ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తామని రైల్వే అధికారులు పేర్కొన్నారు