Trains Cancelled: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌లో కొద్దికాలంగా ట్రాక్ పునరుద్ధరణ, మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. దాంతో ఇటీవలి కాలంలో ఈ మార్గంలో తరచూ రైళ్లు రద్దవుతున్నాయి. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి. రైల్వే ప్రయాణీకులు ముందస్తుగా ఈ సమాచారాన్ని తెలుసుకోవల్సి ఉంటుంది. ఏయే రైళ్లు రద్దయ్యాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తరచూ రైలు ప్రయాణం చేసేవారు ఎప్పటికప్పుడు రైల్వేకు సంబంధించిన అప్‌డేట్స్ తెలుసుకుంటుండాలి. ట్రాక్ పునరుద్ధరణ, మరమ్మత్తు, నిర్వహణ కారణంగా తరచూ కొన్ని మార్గాల్లో రైళ్లు రద్దవడం, ఇంకొన్ని మార్గాల్లో రైళ్లు మళ్లించడం జరుగుతోంది. ఇప్పుడు మరోసారి విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఈ నెల 20 నుంచి 26 వరకూ భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించారు. 


రద్దయిన రైళ్ల వివరాలు


ట్రైన్ నెంబర్ 17267 కాకినాడ పోర్ట్- విశాఖపట్నం
ట్రైన్ నెంబర్ 17268 విశాఖపట్నం-కాకినాడ పోర్టు
ట్రైన్ నెంబర్ 07466 రాజమండ్రి-విశాఖపట్నం
ట్రైన్ నెంబర్ 07467 విశాఖపట్నం-రాజమండ్రి
ట్రైన్ నెంబర్ 17219 మచిలీపట్నం-విశాఖపట్నం
ట్రైన్ నెంబర్ 17243 గుంటూరు-రాయగఢ్
ట్రైన్ నెంబర్ 22702 విజయవాడ-విశాఖపట్నం ( 20, 21, 22, 24, 25 తేదీల్లో)
ట్రైన్ నెంబర్ 22701 విశాఖపట్నం-విజయవాడ ( 20,21,22,24,25 తేదీల్లో)


ట్రైన్ నెంబర్ 17239 గుంటూరు విశాఖపట్నం
ట్రైన్ నెంబర్ 07977 బిట్రగుంట-విజయవాడ, ట్రైన్ నెంబర్ 07978 విజయవాడ-బిట్రగుంట
ట్రైన్ నెంబర్ 07279 విజయవాడ-తెనాలి, ట్రైన్ నెంబర్ 07575 తెనాలి-విజయవాడ
ట్రైన్ నెంబర్ 07461 విజయవాడ-ఒంగోలు, ట్రైన్ నెంబర్ 07576 ఒంగోలు-విజయవాడ
ట్రైన్ నెంబర్ 07500 విజయవాడ-గూడూరు
ట్రైన్ నెంబర్ 17237 బిట్రగుంట-చెన్నై సెంట్రల్, ట్రైన్ నెంబర్  17238 చెన్నై సెంట్రల్-బిట్రగుంట రైళ్లు రద్దయ్యాయి. 


ఈ నెల 21 నుంచి 27 వరకూ ట్రైన్ నెంబర్ 17220 విశాఖపట్నం-మచిలీపట్నం, ట్రైన్ నెంబర్ 17244 రాయగఢ్-గుంటూరు, ట్రైన్ నెంబర్ 17240 విశాఖపట్నం-గూడూరు రైళ్లు రద్దయ్యాయి. 


దారి మళ్లించిన రైళ్లు


ఇక దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జరుగుతున్న పనుల కారణంగా పలు రైళ్లను ముఖ్యంగా విజయవాడ-ఏలూరు మీదుగా వెళ్లే రైళ్లను గుడివాడ, భీమవరం, తణుకు నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. ట్రైన్ నెంబర్ 22643 ఎర్నాకులం-పాట్నా ఈ నెల 20న, ట్రైన్ నెంబర్ 12756 భావనగర్-కాకినాడ పోర్ట్ ఈనెల 25న, ట్రైన్ నెంబర్ 12509 బెంగళూరు-గౌహతి ఈ నెల 22, 24 తేదీల్లో ట్రైన్ నెంబర్ 11019 ఛత్రపతి శివాజీ టెర్మినల్-భువనేశ్వర్ ఈ నెల 20, 22, 24,25 తేదీల్లో గుడివాడ, బీమవరం, నిడదవోలు మీదుగా వెళ్తాయి.


అదే విధంగా ఈ నెల 20 నుంచి 26 వరకూ ట్రైన్ నెంబర్ 13351 దనభాద్-అలప్పూజ, ఈ నెల 20 నుంచి 25 వరకూ ట్రైన్ నెంబర్ 18637 అతియా-బెంగళూరు, ఈ నెల 21, 26 తేదీల్లో ట్రైన్ నెంబర్ 12835 హతియా-బెంగళూరు, ఈ నెల 23న ట్రైన్ నెంబర్ 18111 టాటా-యశ్వంత్ పూర్, ఈ నెల 20వ తేదీన ట్రైన్ నెంబర్ 22837 హతియా-ఎర్నాకులం రైళ్లను గుడివాడ-బీమవరం-తణుకు-నిడదవోలుగా మీదుగా పయనిస్తాయి.


Also read: Chandrababu Campaigning: ఈ నెల 29 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం, జనసేనతో కలిసే కార్యక్రమాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook