Sankranthi Special Trains: సంక్రాంతికి 10 స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే
Sankranthi Special Trains: సంక్రాంతి సీజన్ సందర్భంగా ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ నుంచి విశాఖపట్నం మధ్య 10 స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్లు ప్రకటించింది.
Sankranthi Special Trains: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు.. సొంతూళ్లకు వెళ్లేవాళ్లతో అటు బస్టాండ్ లు, ఇటు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతాయి. ఒక్కోసారి కూర్చునేందుకు సీటు దొరక్కపోయినా.. నిల్చొనైనా సొంతూళ్లకు వెళ్లాలని చాలా మంది ప్లాన్ చేసుకుంటుంటారు. అలాంటి వారి కోసమే దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా 10 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ నెల 7, 14న కాచిగూడ-విశాఖపట్నం, 8, 16వ తేదీన విశాఖపట్నం-కాచిగూడ, 11న కాచిగూడ - నర్సాపూర్, 12న నర్సాపూర్- కాచిగూడ, 19, 21న కాకినాడ టౌన్- లింగంపల్లి , 20, 22న లింగంపల్లి - కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.
1) కాచిగూడ నుంచి విశాఖపట్నం స్పెషల్ ట్రైన్.. మల్కాజ్‌గిరి, చర్లపల్లి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ స్టేషన్ల మీదుగా వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
2) కాచిగూడ నుంచి నర్సాపూర్ రైలు.. మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుందని వెల్లడించారు.
3) కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వెళ్లే స్పెషల్ ట్రైన్.. సామర్లకోట, రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుందని పేర్కొన్నారు.
Also Read: Telangana Omicron Cases: తెలంగాణలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు
Also Read: Andhra Pradesh News: ఏపీలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి