South Central Railway: తెలుగు రాష్ట్రాలకు నిరాశ కల్గించే నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. 31 రైల్వే స్టేషన్లను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఆదాయం, రద్దీను కారణాలు చూపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway ) తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. సరైన ఆదాయం, రద్దీ లేదనే కారణాన్ని చూపిస్తూ.. 31 స్టేషన్లను మూసివేస్తున్నట్టు ( 31 Stations to be closed ) సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి 29 స్టేషన్లు, ఏప్రిల్ 2వ తేదీ నుంచి మరో రెండు స్టేషన్లు మూతపడతాయని అధికారులు తెలిపారు. ఒకే ఒక్క స్టేషన్ మినహాయించి మిగిలిన 30 స్టేషన్లన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. ఆ ఒక్క స్టేషన్ మహారాష్ట్రలోని నాందేడ్ పరిధిలో ఉంది. 


సికింద్రాబాద్ ( Secunderabad ) డివిజన్ పరిధిలో 16, గుంతకల్ పరిధిలో 3, నాందేడ్ పరిధిలో 1, గుంటూరు పరిధిలో 4, హైదరాబాద్ పరిధిలో 7 స్టేషన్ను మూసివేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే..తన పరిధిలో ఉన్న స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏయే స్టేషన్లకు ఆదాయం వస్తుంది..ఏయే స్టేషన్లలో రద్దీ ఉంటుందనే దానిపై గణాంకాలు సేకరించి ఈ నిర్ణయం తీసుకుంది. 


Also read: AP Jobs 2021: ఏపీలో 2,296 Gramin Dak Sevak Postsకు నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook