ఈనెల 11న హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల సదస్సు
ఈనెల 11న హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల సదస్సు
హైదరాబాద్: ఈనెల 11న బేగంపేటలోని ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్లో దక్షిణాది రాష్ట్రాల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెలంగాణా, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు సదస్సులో పాల్గొననున్నాయి. నదుల అనుసంధానం ప్రధాన అజెండాగా జరగనున్న ఈ సదస్సులో తమిళనాడులో తాగునీటి సమస్యపై కూడా చర్చ జరగనుంది. అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో కొనసాగుతున్న కావేరీ నదీ జలాల అంశంపై కూడా సదస్సులో చర్చించనున్నారని తెలుస్తోంది.