Tammineni Comments on Chandrababu: చంద్రబాబు ఒక ఆర్థిక నేరస్థుడు: స్పీకర్ తమ్మినేని
స్కిల్ డెవెలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా సంగతి మన అందరికీ తెలిసిందే. మీడియా సమావేశంలో మాట్లాడిన త మ్మినేని సీతారాం.. చంద్రబాబు ఒక ఆర్ధిక నేరస్థుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
Tammineni on Chandrababu: ఇటీవలే స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా రిమాండ్ లోనే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. బెల్ కోసం అనేక సార్లు అప్లై చేసిన తిరస్కరించటం గమనార్హం. చంద్రబాబు ఆరోగ్యం కుదుటగా ఉన్న చర్మ వ్యాధితో భాదపడుతున్నారు. దీని పట్ల టీడీపీ శ్రేణులు విచారం వ్యక్తం చేసారు. ఇది ఇలా ఉండగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు.
తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును చంపితే మాకు ఏం వస్తుంది..? చంద్ర బాబు ఎక్కడ ఉన్న ఒక్కటేనని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. జైలులో సదుపాయాలపై కోర్టు ద్వారా వారు ఏమి కోరుతున్నారో అవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.. శ్రీకాకుళం లో మీడియా తో మాట్లాడుతూ దేశంలోని నేరగాల్లకి ఎలాగో చంద్రబాబుకి అలాగే ఉంటుంది తప్పా.. ప్రత్యేకంగా చూడరన్నారు. చంద్రబాబు నాయుడు ఆర్థిక నేరగాడు తప్పా మహాత్మా గాంధీనా.. నెహ్రూ కాదన్నారు.. చంద్రబాబు నాయుడు వ్యవహారంతో టీడీపీ పని క్లోజ్ అయిపోయిందని స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు .చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి వాళ్ళు ఇన్ని చేస్తున్నా, సామాన్య ప్రజలలో ఏమి రెస్పాన్స్ లేదనీ సీతారామ్ అన్నారు.
Also Read: Cricket in Olympics: వందేళ్ల తరువాత 2028లో తిరిగి ఒలింపిక్స్‌లో క్రికెట్
ఆర్థిక నేరగాళ్లకు ప్రజలు సపోర్ట్ చేయరని తెలిపిన తమ్మినేని 16 నెలలు జగన్ ని జైలులో పెట్టినప్పటికీ కేసుల్లో నిరూపించుకో లేకపోయారనీ స్పష్టం చేశారు. మరోవైపు ఎంపీ స్థానంపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫాలో అవుతాననీ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. వైఎస్ఆర్ సిపి పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందనీ టిడిపి, జనసేన, బీజేపి లు దమ్మున్న పార్టీలయితే అన్ని స్థానాల్లో పార్టీలు పోటీ చేయాలని స్పీకర్ హోదా లో ఉన్న తమ్మినేని సీతారాం విమర్శించారు. ఎంత మంది కలసి వచ్చినా వైసీపీ కి ఒక్కటే నని సిఎం జగన్ సింహాం అని వైసీపీ సింగిల్ గానే వస్తుందనీ తమ్మినేని అన్నారు. అలాగే పవన్ కి అంత పవనం లేదనీ పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే చమడాలన్ని ఊడిపోయాయనీ ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్ చేయడం విశేషం.
Also Read: Ap Government: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫెయిల్ అయినా మళ్లీ పదో తరగతిలో చేరవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..