AP Assembly Aessions: తెలంగాణ, ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌ హాట్‌ గా జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ సభ్యులపై స్పీకర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ సమావేశాలు ముగిసేవరకు బీజేపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులను.. స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెన్షన్‌ చేశారు. మొత్తం ఐదుగురు సభ్యులను ఈ సెషన్‌ మొత్తానికి కూడా సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్‌ కు గురైన వారిలో కింజారపు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేవశ్‌, నిమ్మల రామానాయుడు, డోలా బాలా వీరాంజనేయస్వామిలు ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై చర్చించాలని సభ ప్రారంభమైనప్పటీ నుంచి కూడా టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. చర్చకు సంబంధించి వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. అయితే వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తమ్మినేని తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. స్పీకర్‌ నచ్చచెప్పినప్పటికీ.. వినకపోవడంతో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఆ తీర్మానానికి అనుగుణంగా స్పీకర్‌ తమ్మినేని టీడీపీ సభ్యులను ఈ సమావేశాలు పూర్తయ్యేంత వరకు సస్పెండ్‌ చేశారు. దీనిపైనా సభలో మిగిలిన టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.


తమ హక్కులు హరించారంటూ టీడీపీ సభ్యులు నినదించారు.
టీడీపీ సభ్యుల ఆందోళనపై మంత్రి ఆళ్ల నాని స్పందించారు. లేని సమస్యలను టీడీపీ సృష్టించి.. శవరాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ప్రజల్లో అపోహలు, అభూతకల్పనలు సృష్టిస్తోందని దుయ్యబట్టారు.


Also Read: Nayanthara Marriage: షాకింగ్.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిచేసుకున్న స్టార్ హీరోయిన్! ఇదిగో సాక్షం!!


Also Read: Earthquake: మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో తెల్లవారుజామున భారీ భూకంపం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook