ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా జీవనాడి వంటిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం స్పష్టం చేసింది. సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగే కీలక చర్చకు అన్ని పార్టీలు సహకరించాలని వైఎస్సార్‌సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ప్రత్యేక హోదా ఆంధ్రుల జీవనాడి! ప్రత్యేక హోదా హామీని అమలు చేయని కారణంగా కేంద్ర సర్కారుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగే కీలక చర్చకు సభలో ఉన్న అన్ని పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.' అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.



 



 


ఏఎన్ఐతో మాట్లాడుతూ, స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలని అభ్యర్థించారు.


'అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలని మేము స్పీకర్ ను అభ్యర్థిస్తున్నాము. బడ్జెట్ సమావేశాలు కొనసాగేవరకూ మేమూ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని పట్టుబడతాము. గత 15 రోజులుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నా.. ఆర్థిక బిల్లుకు ఆమోద ముద్ర వేశారు' అని వైఎస్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలను, నిరసనలు చేపడుతోంది. అవిశ్వాసానికి మద్దతు తెలపాలంటూ పార్టీ ఎంపీలకు వైఎస్సార్‌సీపీ విప్‌ జారీచేసింది.