వైసీపీ అధ్యక్షుడు జగన్ సుధీర్ఘ కాలం పాటు చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేటితో ముగుస్తుంది. పాదయాత్ర ముగింపు సందర్భంలో ఇవాళ ఇఛ్చాపురంలో విజయ సంకల్పస్థూపాన్ని ఆవిష్కరించనున్నారు. 2017 నవంబర్ 6న కడప జిల్లా వైఎస్ఆర్ ఘాట్ నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 341వ రోజుల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్.. ఈ రోజుతో 3 వేల 648 కి.మీ పాతయాత్ర పూర్తి చేయనున్నారు. ఈ క్రమంలో ఏపీలోని 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాలను చుట్టేసిన జగన్ 124 బహిరంగ సభల్లో ప్రసంగించారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈఫిల్ టవర్ ను తలపిస్తున్న పైలాన్
జగన్ సుదీర్ఘ కాలం పాటు చేసిన ప్రజాసంకల్పయాత్రకు చిహ్నంగా శ్రీకాకుళం జిల్లా ఇఛ్ఛాపురంలో ఏర్పాటు చేసిన  పైలన్ అందరిని ఆకర్షిస్తోంది. ఇచ్ఛాపురంలోని 16 నెంబర్ జాతీయ రహదారి పక్కన విజయ సంకల్ప స్థూపాన్ని ఏర్పాటు చేశారు . ఈఫిల్ టవర్ ను తలపించేలా 91 అడుగుల ఎత్తులో ఫైలాన్ ఏర్పాటు చేశారు. దీనికి పది అడుగుల ఎత్తులో వైసీపీ జెండా పాతారు. పైలాన్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోతో పాటు వైఎస్ జగన్ ఫోటో పెట్టారు. పైలన్ ద్వారం వద్ద 13 మెట్లు పెట్టి వాటిపై 13 జిల్లాల పేర్లను రాశారు


ఇడుపులపాయ - ఇచ్ఛాపురం
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు దాదాపు ఏడాది పాటు  విజయవంతం సాగిన ఈ పాద్రయాత్ర ముగింపునకు ఇచ్చాపురం వేదికైంది. పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైసీపీ అభిమానులు భారీ ఎత్తున  హాజరౌతున్నారు.  శ్రీకాకుళం జిల్లాలో నెలల రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్న జగన్ మధ్యాహ్నానికి ఇఛ్చాపురం పైలన్ వద్ద చేసుకుంటారు. పైలాన్ ఆవిష్కరణ తర్వాత ఆయన విజయనగరానికి బయలేదరి రాత్రి అక్కడ బసచేస్తారు. రేపు ఉదయం తిరుపతికి వెళ్తారు. కాలినడకన శ్రీవారిని దర్శించుకొంటారు.11న కడపలోని పెద్ద దర్గాల్లో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పులివెందుల చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అక్కడి నుంచి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పిస్తారు. దీంతో సుదీర్ఘకాలంగా చేపట్టిన జగన్ పాదయాత్రకు సమప్తం అవుతుంది.