Ap Corona Update: ఏపీలో ఆగని కరోనా ఉధృతి , 24 గంటల్లో 21 వేల కేసులు
Ap Corona Update: కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండవ రోజు కూడా పెద్దఎత్తున కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా నిర్ధారణ పరిక్షలు కూడా పెరిగాయి.
Ap Corona Update: కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండవ రోజు కూడా పెద్దఎత్తున కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా నిర్ధారణ పరిక్షలు కూడా పెరిగాయి.
ఏపీలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభించింది. పగలు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నా రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గడం లేదు. వరుసగా రెండవ రోజు కూడా 21 వేల కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 90 వేల 750 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..21 వేల 452 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 13 లక్షల 44 వేల 386 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 89 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 8 వేల 988 కు చేరింది. గత 24 గంటల్లో 19 వేల 95 మంది కోవిడ్ నుంచి కోలుకోగా..ఇప్పటి వరకూ రాష్ట్రంలో 11 లక్షల 35 వేల 133 మంది కోలుకున్నారు.
ఏపీలో ప్రస్తుతం 1 లక్షా 97 వేల 370 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1 కోటి 76 లక్షల 5 వేల 687 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
Also read: Ramadan Restrictions: రంజాన్ పండుగ ప్రార్ధనలపై ఏపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook