తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి(టీటీడీ బోర్డు)లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి పదవి కోల్పోయిన ఆ ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఉదంతం కొత్త మలుపులు తిరుగుతోంది. ధర్మానికి శాస్త్రాలకు విరుద్ధంగా టీటీడీ బోర్డు వ్యవహరిస్తున్నాదని, ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా పనులు జరుగుతున్నాయని, అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే ప్రధాన అర్చక పదవి నుండి తప్పించారని రమణ దీక్షితులు ఆరోపించిన సంగతి తెలిసిందే! అయితే టీటీడీ వివాదంలోకి అనూహ్యంగా బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అనూహ్యంగా బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి దీనిపై స్పందించారు. టీటీడీలో ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించాలి బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి  ట్వీట్ చేశారు. రమణ దీక్షితులును తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలని సుబ్రమణియన్ స్వామి నిర్ణయించారు. టీటీడీ నిర్ణయంపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు.



మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం టీటీడీ విధానంపై స్పందించారు. టీటీడీ వివాదంపై ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఆభరణాలు తరలిపోయినట్లుగా ఎప్పట్నుంచో అనుమానాలున్నాయన్నారు. ఆభరణాలు ఇజ్రాయెల్ తరలి వెళ్లినట్లుగా గతంలో తనకొక అధికారి చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. రమణ దీక్షితుల ఆరోపణలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.