Supreme court hearing on laddu controversy: తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ముదిగి పాకానా పడింది. ఇప్పటికే దీనిపై ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. వైసీపీ, కూటమి పార్టీలు ఒకరిపై మరోకరు ఆరోపణలు, ఘాటైన విమర్శలు సైతం చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా..వైఎస్సార్సీపీ హయాంలో.. తిరుమలలో అరాచకాలు జరిగాయని, ముఖ్యంగా భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని కూడా  ఏకంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా ల్యాబ్ రిపోర్టును  సైతంబైటపెట్టారు. మరో వైపు దీనిపై వైసీపీ కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది. కూటమి వంద రోజుల పాలనలో పాలన నుంచి డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు కొత్త నాటకం  స్టార్ట్ చేశారని కూడా మాజీ సీఎం జగన్ సైతం గట్టిగానే విమర్శల్ని తిప్పికొట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో..లడ్డు వివాదంపై ఏపీ తొలుత సిట్ ను సైతం ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అంతే కాకుండా.. దీనిపై  బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తో పాటు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రచయిత సంపత్ విక్రమ్, ఓ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు చౌహాన్కే సుప్రీంకోర్టులో పిటిషన్ లను దాఖలు చేశారు. దీనిపై గత గురువారం సుప్రీంకోర్టులో వాడీ వేడీ వాదనలు నడిచాయి.


సుప్రీంకోర్టు ఏపీ తరపు లాయర్ అయిన.. తుషార్‌ మెహతా ప్రశ్నల వర్షం కురిపించింది. లడ్డు వివాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, టీటీడీ ప్రకటన భిన్నంగా ఉన్నాయన్నారు. లడ్డు వివాదంపై కొన్ని కోట్ల మంది మనో భావాలకు చెందిన విషయమని.. పక్కా ఆధారాలేక్కుండా సీఎం స్థాయి వ్యక్తి ఎలా వ్యాఖ్యలు చేస్తారంటూ మండిపడింది. సిట్ దర్యాప్తు పూర్తికాక ముందే.. ఏదో జరిగిందని మీడియా ముందుకు రావాల్సిన అవసరమేముందని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేసును.. ఈ రోజుకు (శుక్రవారం) వాయిదా వేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో పరిణామాల నేపథ్యంలో ఏపీ సర్కారు వెంటనే సిట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.


అంతేకాకుండా.. దీనిపైక కేంద్ర దర్యాప్తు సంస్థల చేత ప్రత్యేకంగా దర్యాప్తు చేయించాలా..?,  సీబీఐ ను ఏర్పాటు చేయాలా..? మరీ ధర్మాసనం ఏవిధమైన ఆదేశాలు ఇస్తుందో అని ఏపీ సర్కారు వెచీచూస్తుందని తెలుస్తోంది. మరోవైపు... ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఉదయం పూట విచారిస్తామని ప్రకటించింది. మరోవైపు తిరుమల లడ్డు వివాదంపై ప్రజాశాంతి చీఫ్ సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  తిరుమల కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. 


తిరుమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు..


  ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు  ప్రారంభమయ్యాయి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నాయ. మరోవైపు శ్రీవారికి   బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించుకొవడం ఆనవాయితీగా వస్తుంది. ఈనేపథ్యంలో చంద్రబాబు ఈ రోజు తిరుమలకు చేరుకొనున్నట్లు తెలుస్తోంది.


అంతే కాకుండా.. అక్కడ వెంకటేశ్వర స్వామికి ఈరోజు నిర్వహించే.. పెద్దశేష వాహానం సేవలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.రాత్రికి తిరుమలలోనే చంద్రబాబు బసచేస్తారు. రేపు ఉదయం టీటీడీ డైరీ , క్యాలెండర్ లను ఆవిష్కరించిన తర్వాత  వకుళమాత వంటశాలను సైతం ప్రారంభిస్తారని సమాచారం. మరోవైపు తిరుమలలో  సామాన్య భక్తులు ప్రయారిటీగా టీటీడీ చర్యలు తీసుకున్నట్లు ఈవో శ్యామల్ రావు తెలిపారు. ఈ సమయంలో వీఐపీల  సిఫారసులను రద్దు చేసినట్లు వెల్లడించారు.


అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో వేడుకా ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజారోహణం నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదమంత్రాలు,  మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.


Read more: Tirumala: ఒక్కరోజులోనే తిరుమల దర్శనం.. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్ ఇదే..


ఆ తరువాత రాత్రి 9 నుండి 11 గంటల వ‌ర‌కు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు తిరుమలలో ఉంటారని తెలుస్తోంది. శనివారం కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఈవో వివరించారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.