ఏపీ హైకోర్టులో గత కొద్దికాలంగా ఓ విపత్కర పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకూ ఎప్పుడూ లేనంతగా కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోయాయి. 2019 నుంచి ఇప్పటి వరకూ అంటే గత మూడేళ్లలో ఏకంగా 350 శాతం కేసులు పెరిగాయని అంచనా. ఈ పరిస్థితి ఎందుకు, ఇది దేనికి సంకేతం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ హైకోర్టులో 2022 అంటే ఈ ఏడాది నవంబర్ 18 నాటికి ఉన్న కోర్టు ధిక్కరణ కేసుల సంఖ్య అక్షరాలా 5,324 కేసులు. కాగా 2019లో ఈ సంఖ్య కేవలం 1175 మాత్రమే ఉంది. మరో విశేషమేమంటే..ఇందులో అత్యధిక కేసుల్లో కోర్డు ధిక్కరణ కేసులు రాష్ట్ర ప్రభుత్వంపైనే. వివిధ కేసుల్లో, వివిధ సందర్భాల్లో హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయడంలో విఫలం చెందిందనే కారణంతో ఈ కేసులు నమోదయ్యాయి.


రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో చేసిన పనులకు గానూ..కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో..సదరు కాంట్రాక్టులు కోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారించిన కోర్టు బిల్లులు చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినా అమలు కాలేదని ఆరోపణ. కేసుల సంఖ్య పెరగడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి లిటిగేషన్ కాగా రెండవది పెండెన్సీ. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల తరువాత కూడా బిల్లులు చెల్లించకపోవడంతో..కోర్టు ధిక్కరణ కేసులు దాఖలు చేశారు.


రాష్ట్ర ప్రభుత్వ దృక్పధానికి, కోర్టు ఆదేశాలకు మధ్య అధికారులు నలిగిపోతున్న పరిస్థితి. మరోవైపు పిటీషనర్లు కూడా దిగువ కోర్టుల్ని ఆశ్రయించకుండా..నేరుగా హైకోర్టునే ఆశ్రయించడం కూడా మరో ప్రధాన కారణంగా ఉంది. ఈ కారణాల వల్లనే హైకోర్టులో ధిక్కరణ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. కేవలం కొన్ని కేసులు మాత్రమే తీర్పుల వరకూ వస్తున్నాయి.


పెరుగుతున్న కోర్టు ధిక్కరణ కేసులు దేనికి సంకేతం


కేసుల సంఖ్యతో సమానంగా తీర్పు పూర్తయిన కేసుల సంఖ్య పెరిగితే..కచ్చితంగా అది ఓ ప్రమాదకర పరిస్థితిని సూచిస్తుంది. ఇదంతా  కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని సీనియర్ కౌన్సిల్ సత్యనారాయణ ప్రసాద్ తెలిపారు. అటు ప్రభుత్వం కూడా బిల్లు చెల్లించేందుకు కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసేవరకూ..వేచి చూస్తోంది. 


కోర్టులపై నమ్మకం పోతుంది


తన కెరీర్‌లో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని..ఏడాదికి కోర్టు ధిక్కరణ కేసులు 1000 కంటే తక్కువే ఉండాలని..సత్యనారాయణ ప్రసాద్ చెప్పారు. ప్రభుత్వం దివాళా తీసి.,రాష్ట్రం ఆర్ధిక అత్యయిక పరిస్థితి తలెత్తినట్టుగా పరిస్థితి ఉందన్నారు. కోర్టు ధిక్కరణ కేసులు పెరగడం అనేది కోర్టుల విశ్వసనీయతపై ప్రభావం చూపిస్తుందన్నారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోతే..ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని న్యాయ నిపుణులు ఆవేదన చెందుతున్నారు.


Also read: Idem Karma: ఇదేం కర్మపై వ్యతిరేకత, తెలుగు తమ్ముళ్లకు నచ్చని రాబిన్ శర్మ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook