Omicron Tension in Srikakulam District: ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు భారత్ ను కలవర పెడుతోంది. ఈ వేరియంట్ తెలుగు రాష్ట్రాల్లోనూ భయాందోళన రేపుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా(Srikakulam district)లో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. సంత బొమ్మాలి(Santabommali) మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బాధితుడు ఇటీవలే దక్షిణాఫ్రికా(South Africa) నుంచి జిల్లాకు వచ్చినట్లు సమాచారం. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యి...అతడికి వైద్య పరీక్షలు చేశారు. దీంతో అతడికి కరోనా పాజిటివ్(Covid-19 Positive)గా నిర్ధారణ అయ్యింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Omicron Variant: పొరుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు, అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం


తిరిగి 14 రోజుల అనంతరం కరోనా పరీక్షలు చేయగా...మళ్లీ కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వైద్యులు అతడిని హుటాహుటీన శ్రీకాకుళం రిమ్స్(Rims) ఆస్పత్రికి తరలించారు. ఒమిక్రాన్ అనుమానంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అతనికి లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ ను రిమ్స్ మెడికల్ కాలేజీకి పంపించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. జిల్లా వాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బగాది జగన్నాదం స్పష్టం చేశారు. ఇక ఈ రిపోర్ట్‌పై అధికారులు, జిల్లా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook