అమరావతి: ఏపీ రాజధాని అమరావతి రైతులను ఉద్దేశించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) ఛైర్మన్, నటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య తలెత్తితే సమస్య పరిష్కారం గురించి మాట్లాడాలే తప్ప.. కులాలు వంటి అంశాలు ప్రస్తావించడం సరికాదని పృథ్వీరాజ్‌కు జగన్ సూచించినట్లు సమాచారం. అయితే రైతుల కులాలపై పృథ్వీరాజ్‌ మాట్లాడటాన్ని వైఎస్సార్ సీపీ నేతలు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏ సామాజిక వర్గాలను ప్రస్తావిస్తూ, ఎవరిరైనా కించపరిచేలా మాట్లాడకూడదని.. ఇకనుంచి ఇలాంటివి రిపీట్ కావొద్దని పృథ్వీరాజ్‌ను సీఎం జగన్ ఆదేశించినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు ఓ మహిళా ఉద్యోగినితో రొమాంటిక్‌గా మాట్లాడిన ఆడియో టేపు విషయంలో సైతం ‘థర్టీ ఇయర్స్ పృథ్వీ’ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎస్వీబీసీ ఛాంబర్‌ను తప్పుడు పనులకు వాడుకున్నారని, 36 మంది ఉద్యోగులను సైతం తన ఇష్టానుసారం నియమించగా.. టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మందలించారు. అనంతరం 30 మంది ఉద్యోగులను పృథ్వీరాజ్‌ తొలగించినట్లు తెలుస్తోంది.  


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో టేప్ ప్రకారం.. నేను నీకు గుర్తు రాలేదా..? అని ఎస్వీబీసీ ఛైర్మన్ ఆ మహిళను అడిగారు. మార్చి నెల వరకు మద్యం తాగనని, మళ్లీ డ్రింక్ చేయడమంటే... నీ దగ్గర కూర్చొని మొదలుపెడతానన్నారు. నువ్వు గుండెల్లో ఉన్నావ్ అని అన్నారు. వెనుక నుంచి వచ్చి నిన్ను గట్టిగా పట్టుకుందామని అనుకున్నాను. కానీ నువ్వు అరుస్తామని ఆగిపోయానని పృథ్వీ చెప్పినట్లుగా ఉన్న ఆడియో వైరల్ అవుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..