తిరుమల: ఎస్వీబీసీ ఛానల్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి శతమానం భవతి కార్యక్రమం వివరాల కోసం మెయిల్ చేసిన ఓ భక్తుడికి పోర్న్ సైట్ లింక్ పంపిన ఘటన టీటీడీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎస్వీబీసీ ఛానెల్ నుంచి మెయిల్ ద్వారా వచ్చిన ఆ లింక్ చూసి ఆశ్చర్యపోయిన ఆ భక్తుడు వెంటనే ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తూ అదే లింకుని వారికి ఫార్వార్డ్ చేయడంతో ఎస్వీబీసీలో చోటుచేసుకున్న ఈ తప్పిదంపై టీటీడీ విచారణ చేపట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?


టీటీడీ విజిలెన్స్, ఎస్వీబీసీ ( SVBC ) అధికారులతో పాటు రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ టీమ్.. ఎస్వీబీసీలో పనిచేసే సిబ్బందిలో ఐదుగురు ఉద్యోగులు పోర్న్ సైట్లు చూస్తున్నారని గుర్తించారు. ఇంకొంత మంది ఉద్యోగులు ఇతర వెబ్‌సైట్లను తరచుగా వీక్షిస్తున్నట్టు తేలింది. శతమానం భవతి కార్యక్రమం  ( Shatamanam Bhavathi program ) వివరాల కోసం మెయిల్ చేసిన భక్తుడికి ఎస్వీబీసీలో పనిచేసే హరికృష్ణ అనే ఉద్యోగి ఆ పోర్న్ వెబ్‌సైట్ లింక్ పంపినట్టు విచారణలో నిర్ధారించుకున్న పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితమే ఎస్వీబీసీ ఛానెల్ యాజమాన్యం హరికృష్ణను విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని ఆసక్తికరమైన వార్తలు, అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి