Rohit Sharma And Virat Kohli in T20 World Cup: మరో రెండు రోజుల్లో టీ20 వరల్డ్ కప్ సమరం ఆరంభం కానుంది. జూన్ 2వ తేదీ నుంచి అమెరికా-వెస్టిండీస్ వేదికగా ప్రారంభంకానుండగా.. ఇప్పటికే అన్ని జట్లు అక్కడికి చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. టీమిండియా కూడా అమెరికాలో మకాం వేసింది. భారత్ చివరిసారిగా ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలిచింది. మళ్లీ అప్పటి నుంచి పొట్టి కప్ కోసం వేటా కొనసాగిస్తునే ఉంది. ఈసారి రోహిత్ శర్మ నాయకత్వంలో పటిష్టంగా ఉన్న టీమిండియా.. ఎలాగైనా టీ20 ప్రపంచకప్ గెలవాలని తీవ్రంగా పట్టుదలతో ఉంది. భారత్ జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ఆడనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Air hostess: దొరికిపోయిన లేడీ ఎయిర్ హోస్టెస్.. ప్రైవేట్ పార్ట్ లో బంగారం పేస్ట్.. ఎయిర్ హిస్టరీలో తొలికేసు..


ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ జూన్ 9న జరగనుంది. ఆ తర్వాత జూన్ 12న అమెరికాతో, జూన్ 15న కెనడాతో టీమిండియా తలపడనుంది. భారత్ సూపర్-8కు అర్హత సాధించాలంటే గ్రూప్‌లో టాప్-2లో నిలవాల్సి ఉంటుంది. ఐపీఎల్ ఆడిన టీమిండియా ఆటగాళ్లు నేరుగా వరల్డ్ కప్‌లో ఆడనున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, దూబే, రవీంద్ర జడేజా తదితర ఆటగాళ్లు ఇప్పటికే అమెరికా వెళ్లారు. అయితే విరాట్ కోహ్లీ ఇంకా జట్టుతో చేరలేదు. జూన్ 1న బంగ్లాదేశ్‌తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ దూరమేయ్యే అవకాశం కనిపిస్తోంది. 


ఈసారి ఐపీఎల్‌లో రాణించిన ఆటగాళ్లకు టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కలేదు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సీనియర్లకే పెద్దపీట వేసింది. అందుకే ఐపీఎల్‌లో బాగా ఆడిన అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లకు చోటు దక్కలేదు. హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోయినా.. అనుభవం రీత్యా తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక ప్లేయింగ్-11 ఎలా ఉంటుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.


ఐపీఎల్‌లో ఓపెనర్‌గా వచ్చి విరాట్ కోహ్లీ దుమ్ములేపుతున్నాడు. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో కూడా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభిస్తే.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. వన్‌డౌన్‌లో సంజూ శాంసన్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం ఉంది. ఆ తరువాతి స్థానాల్లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జడేజాలు ఉంటారు. స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, చాహల్, ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌ తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది. ఆయా మైదానాలను బట్టి అదనపు ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లను తీసుకోనున్నారు.


టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.


Also Read: Kavya Maran Love Story: ఎస్ఆర్‌హెచ్‌ యంగ్ ప్లేయర్‌తో కావ్య మారన్ డేటింగ్.. ఆ క్రికెటర్ ఎవరంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter