Maganti Ramji Death News: మాగంటి రాంజీ మృతి పట్ల Chandrababu తీవ్ర దిగ్భ్రాంతి, TDPకి తీరని లోటు అని ట్వీట్
Maganti Ramji Death News Updates | మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ(37) మృతిచెందారు. మాగంటి రాంజీ మృతిపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. మాగంటి రాంజీ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Chandrababu Condoles Death Of Maganti Ramji: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ(37) మృతిచెందారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనైన మాగంటి రాంజీని విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మాగంటి రాంజీ(Maganti Ramji Passed Away) చనిపోయారు. నేటి ఉదయం ఏలూరులోని మాగంటి బాబు నివాసానికి రాంజీ భౌతికకాయాన్ని తరలించారు.
మాగంటి రాంజీ మృతిపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) స్పందించారు. మాగంటి రాంజీ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాంజీ మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ‘మాగంటి రాంజీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొంటూ ఉంటే.. ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉంటుందనుకున్నాం. అలాంటిది చాలా చిన్న వయసులో ఇలా అర్థాంతరంగా అందరికీ దూరమైపోవడం బాధాకరం. పార్టీకి తీరని లోటు’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
Also Read: Maganti Ramji Passed Away: టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు తనయుడు రాంజీ కన్నుమూత
మాగంటి బాబు కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘పుత్రశోకం నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని మాగంటి వెంకటేశ్వరరావు(Maganti Babu)కి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ.. వారి కుటుంబసభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని’ ట్వీట్‌లో పేర్కొన్నారు. మాగంటి రాంజీ అంత్యక్రియలకు ఏలూరులో ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు ఏలూరుకు చేరుకుంటున్నాయి.
Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్, త్వరలో బ్యాంక్ ఖాతాలో రూ.2000 జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook